Premisthunna: 'అన్ కండీషనల్ లవ్ తో వస్తున్నా'ప్రేమిస్తున్నా'
ABN, Publish Date - Oct 11 , 2025 | 11:04 PM
సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం 'ప్రేమిస్తున్నా'. కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో వస్తున్నా చిత్రమిది.
సాత్విక్ వర్మ (Satwik Varma), ప్రీతి నేహా (Preeti Varma) హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం 'ప్రేమిస్తున్నా'(Premistunna). కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో వస్తున్నా చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా ను మేకర్స్ విడుదల చేశారు. 56 సెకెన్స్ నిడివి ఉన్న కంటెంట్ యువతను విపరీతంగా ఆకట్టుకొంటోంది. సినిమా ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశారు చిత్ర యూనిట్. 'ఇంటెన్స్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను న్యూ ఏజెడ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించబోతున్నారు.ఇటీవల విడుదలైన ఈ సినిమా సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది, యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో ప్రేక్షకాధారణ పొందింది' అన్నారు.
దర్శకుడు భాను మాట్లాడుతూ 'అన్ కండీషనల్ లవ్ తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. చాలా కాలం తరువాత వస్తోన్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఈ సినిమా, మేము విడుదల చేసిన సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా కు అన్ని వర్గాల ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోందని' అన్నారు.