త్వరలోనే రీస్టార్ట్
ABN, Publish Date - May 23 , 2025 | 04:04 AM
రాజకీయాల్లో బిజీగా ఉన్న ఏపీ డిప్యూటి సీఎం పవన్‌కల్యాణ్, తాను అంగీకరించిన చిత్రాలను వరుస పెట్టి పూర్తి చేయాలనే లక్ష్యంతో మేకర్స్‌కు కాల్షీట్లు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే...
రాజకీయాల్లో బిజీగా ఉన్న ఏపీ డిప్యూటి సీఎం పవన్‌కల్యాణ్, తాను అంగీకరించిన చిత్రాలను వరుస పెట్టి పూర్తి చేయాలనే లక్ష్యంతో మేకర్స్‌కు కాల్షీట్లు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్ పూర్తయి, జూన్ 12న విడుదలకు సిద్ధమైంది. ఇటీవలె ఆయన నటిస్తున్న మరో చిత్రం ‘ఓజీ’ షూట్ కూడా తిరిగి ప్రారంభమైనట్లు నిర్మాత డి.వి.వి.దానయ్య తెలిపారు. పవన్ కల్యాణ్ నటిస్తున్న మరో చిత్రం గురించి తాజాగా అప్డేట్ వచ్చింది. ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం షూటింగ్ కూడా త్వరలోనే పునః ప్రారంభించనున్నట్లు మేకర్స్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘‘పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే గొప్ప పాత్రను తెరపై చూసి వేడుక చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇది అభిమానులకు, సినీ ప్రియులకు కన్నులపండుగ లాంటిది. ఈ ప్రాజెక్ట్ అనేక సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంటుంది. త్వరలోనే షూట్‌ను రీస్టార్ట్ చేస్తున్నాం’’ అని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ పేర్కొంది. హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ శక్తిమంతమైన పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు.