Pawan Kalyan Movie: వీరమల్లు రాక వాయిదా
ABN, Publish Date - Jun 07 , 2025 | 06:10 AM
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదల మరోమారు వాయిదా పడింది. ఈ నెల 12న ఈ చిత్రం విడుదలవ్వాల్సి ఉండగా, మరోసారి వాయిదావేస్తున్నట్లు నిర్మాత ఏ.ఎం.రత్నం తెలిపారు.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదల మరోమారు వాయిదా పడింది. ఈ నెల 12న ఈ చిత్రం విడుదలవ్వాల్సి ఉండగా, మరోసారి వాయిదావేస్తున్నట్లు నిర్మాత ఏ.ఎం.రత్నం తెలిపారు. ‘ఎంతో సహనం, నమ్మకంతో ‘హరిహర వీరమల్లు’ సినిమాకు అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రేమికులకు ధన్యవాదాలు. గతంలో ప్రకటించిన తేదీకే ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావాలని తీవ్ర ప్రయత్నం చేశాం. అయితే ఎంత శ్రమించినా ఆ తేదీకల్లా సినిమాను విడుదలకు సిద్ధం చేయలేకపోతున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ‘హరిహర వీరమల్లు’ను మరింత గొప్పగా తీర్చిదిద్దాలనేదే మా ఆలోచన. అందుకే మేము మరికొంత సమయం తీసుకుంటున్నాం. మీ ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాం’ అని ఏ. ఎం రత్నం తెలిపారు. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేసి, కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని ఆయన చెప్పారు. జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో ఏ. దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.