సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

థియేటర్ల బంద్‌ లేదు

ABN, Publish Date - May 25 , 2025 | 03:45 AM

‘ఏదో ఒక సినిమాను టార్గెట్‌ చేసి, థియేటర్లను బంద్‌ చేస్తున్నారు అనే ప్రచారాన్ని ఖండిస్తున్నాం. జూన్‌ 1 నుంచి థియేటర్ల బంద్‌ లేదు. ఈ విషయంపై అవసరం వస్తే ప్రభుత్వంతో సైతం చర్చిస్తాం’ అని ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి కేఎల్‌ దామోదర్‌...

  • సమస్యల పరిష్కారానికి కమిటీ

‘ఏదో ఒక సినిమాను టార్గెట్‌ చేసి, థియేటర్లను బంద్‌ చేస్తున్నారు అనే ప్రచారాన్ని ఖండిస్తున్నాం. జూన్‌ 1 నుంచి థియేటర్ల బంద్‌ లేదు. ఈ విషయంపై అవసరం వస్తే ప్రభుత్వంతో సైతం చర్చిస్తాం’ అని ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలో సింగిల్‌ స్ర్కీన్‌ల బంద్‌ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టతనిచ్చారు. థియేటర్ల బంద్‌ అంశంపై కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. వీరంతా ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆధ్వర్యంలో శనివారం ఉమ్మడిగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘జూన్‌ 1 నుంచి థియేటర్ల బంద్‌ జరగడం లేదు.


ఈ నెల 30న ఈసీ మీటింగ్‌ ఉంటుంది. ఆ రోజు మూడు విభాగాల సభ్యులతో కమిటీ వేయబోతున్నాం. తద్వారా ఈ సమస్యకు నిర్ణీత సమయంలో పరిష్కారం వచ్చే అవకాశం ఉంది. చిత్ర పరిశ్రమ కష్టాలను బయట వారెవ్వరూ తీర్చరు. స్వయంగా పరిశ్రమే అందులో నుంచి బయటపడుతుంది’ అని చెప్పారు.


Updated Date - May 25 , 2025 | 03:45 AM