సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లోకి

ABN, Publish Date - Jun 05 , 2025 | 03:18 AM

మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’ ఫేమ్‌ నివిన్‌ పాలీ ఓ క్రేజీ ఆఫర్‌ దక్కించుకున్నారు. తాజాగా, ఆయన లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లోకి...

మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’ ఫేమ్‌ నివిన్‌ పాలీ ఓ క్రేజీ ఆఫర్‌ దక్కించుకున్నారు. తాజాగా, ఆయన లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లోకి ఎంటరయ్యారు. ఎల్‌సీయూలో భాగమైన ‘బెంజ్‌’ సినిమాలో ‘వాల్టర్‌’ అనే కీలక పాత్రను పోషిస్తున్నట్లు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియా ద్వారా వెల్లడించారు. ‘‘ఈ పాత్రను పోషిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. చాలా రోజులుగా ఈ అద్భుతమైన అప్‌డేట్‌ను మీతో పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాను. ఈ పాత్ర ఎంతో ప్రత్యేకం’’ అని పేర్కొన్నారు. ఈ వీడియో చూస్తుంటే ఆయన సినిమాలో క్రూరమైన విలన్‌ ఛాయలున్న ‘వాల్టర్‌’ పాత్రతో పాటు మరో భిన్నమైన రోల్‌లోనూ కనిపించనున్నట్లు తెలుస్తోంది.లోకేశ్‌ కనగరాజ్‌ కథ అందించడంతో పాటు సమర్పిస్తున్న చిత్రం ‘బెంజ్‌’. రాఘవలారెన్స్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. బక్కియరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో లోకేశ్‌ కనగరాజ్‌, సుదాన్‌ సుందరమ్‌, జగదీష్‌ పళనిస్వామి నిర్మిస్తున్నారు. సంయుక్త కథానాయిక.

Updated Date - Jun 05 , 2025 | 03:18 AM