సరికొత్త వినోదం
ABN, Publish Date - Jun 08 , 2025 | 03:56 AM
బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రానికి ‘మిత్ర మండలి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల...
బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రానికి ‘మిత్ర మండలి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ నీలిరంగు ముసుగుల వెనుక ఉన్న గ్యాంగ్‌ను పరిచయం చేసింది. నూతన దర్శకుడు విజయేందర్.ఎస్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ‘మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్’ కోసం టామ్ క్రూజ్‌తో కలసి పనిచేసిన నిహారిక ఎన్.ఎం. ఈ చిత్రం ద్వారా తెలుగులోకి అరంగేట్రం చేస్తున్నారు. ‘‘మిత్ర మండలి’ అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుంది’ అని చిత్రబృందం తెలిపింది. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప్, డా.విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు.