సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రైలుపై సాహస కృత్యాలు

ABN, Publish Date - May 27 , 2025 | 03:14 AM

తేజ సజ్జా హీరోగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘మిరాయ్‌’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు...

తేజ సజ్జా హీరోగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘మిరాయ్‌’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈనెల 28న సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ చిత్రబృందం పోస్టర్‌ని విడుదల చేసింది. తేజ సజ్జా చేతిలో మంత్రదండం పట్టుకొని నడుస్తున్న రైలుపై నిలబడి, సాహస కృత్యాలు చేస్తుండటం ఆసక్తిని కలిగిస్తోంది.ఈ సినిమాలో తేజ సజ్జా సూపర్‌ యోధగా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే మంచు మనోజ్‌ విలన్‌గా, రీతికా నాయక్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన తేజ సజ్జా, మంచు మనోజ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు, స్పెషల్‌ గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

Updated Date - May 27 , 2025 | 03:14 AM