Mass Jathara: జాతరకు ముహూర్తం

ABN , Publish Date - May 30 , 2025 | 05:46 AM

రవితేజ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్‌ జాతర’ రిలీజ్‌ డేట్‌ నిర్ణయించారు. వినాయకచవితి సందర్భంగా ఆగస్టు 27న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు...

రవితేజ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్‌ జాతర’ రిలీజ్‌ డేట్‌ నిర్ణయించారు. వినాయకచవితి సందర్భంగా ఆగస్టు 27న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య చెప్పారు. భాను భోగవరపు దర్శకుడు. రవితేజ నుంచి ఆయన అభిమానులు, ప్రేక్షకులు కోరుకొనే విధంగా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు తెలిపారు. శ్రీలీల ఈ చిత్ర కథానాయిక. బాక్సాఫీసు దగ్గర మెరుపులు మెరిపించడానికి రవితేజ, శ్రీలీల సిద్ధమవుతున్నారు. ‘ధమాకా’ విజయంలో భీమ్స్‌ సిసిరోలియో సంగీతం కీలక పాత్ర పోషించింది. అలాగే మరో సారి ‘మాస్‌ జాతర’తో ఆయన మాస్‌ ప్రేక్షకులను మెప్పించనున్నారు.

Updated Date - May 30 , 2025 | 06:01 AM