సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నాయకుడు కంటే పెద్ద హిట్‌ అవుతుంది

ABN, Publish Date - May 23 , 2025 | 04:06 AM

‘నేను మనసు పెట్టి చేసిన ప్రతి సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు. అందుకే సినిమాను బాగా ప్రమోట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ‘నాయకుడు’ కంటే ‘థగ్‌ లైఫ్‌’ పెద్ద విజయం...

‘నేను మనసు పెట్టి చేసిన ప్రతి సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు. అందుకే సినిమాను బాగా ప్రమోట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ‘నాయకుడు’ కంటే ‘థగ్‌ లైఫ్‌’ పెద్ద విజయం సాధిస్తుంది’ అని అన్నారు సీనియర్‌ నటుడు కమల్‌ హాసన్‌. ఆయన హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూన్‌ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ ‘మణిరత్నం సినిమాలో నేను నటించను, జస్ట్‌ బిహేవ్‌ చేస్తాను. ‘ఇంద్రుడు చంద్రుడు’ సినిమాకు తనికెళ్ల భరణి రాయాల్సింది. కానీ కుదరలేదు. ఆయనతో కలసి మరింత ప్రయాణం చేయాలని ఉంది’ అని అన్నారు. దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ ‘చాలా కాలం తర్వాత కమల్‌తో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆయన ‘నాయకుడు’ సమయంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు’ అని అన్నారు.


నిర్మాత సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ ‘ఇంతకు ముందు కమల్‌హాసన్‌ నటించిన రెండు సినిమాలు నేనే రిలీజ్‌ చేశాను. అవి బ్లాక్‌ బస్టర్‌ అయ్యాయి. ట్రైలర్‌, పాటలు చూసిన తర్వాత ఈ సినిమా కూడా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందనే నమ్మకం కలిగింది’ అని అన్నారు.


Updated Date - May 23 , 2025 | 04:06 AM