ఆగిపోలేదు.. బడ్జెట్‌ గురించే ఆలోచిస్తున్నాం

ABN, Publish Date - Feb 05 , 2025 | 05:15 AM

‘అదుగో క్రిష్‌ 4 వస్తోంది.. ఇదిగో క్రిష్‌ 4 తయారవుతోంది’.. అంటూ చాలా కాలంగా వినిపిస్తున్న వార్తలపై ఆ చిత్ర దర్శకుడు రాకేశ్‌ రోషన్‌ ఎట్టకేలకు నోరు విప్పారు. ఆ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న...

‘అదుగో క్రిష్‌ 4 వస్తోంది.. ఇదిగో క్రిష్‌ 4 తయారవుతోంది’.. అంటూ చాలా కాలంగా వినిపిస్తున్న వార్తలపై ఆ చిత్ర దర్శకుడు రాకేశ్‌ రోషన్‌ ఎట్టకేలకు నోరు విప్పారు. ఆ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ‘క్రిష్‌ 4’ చిత్రం ఆగిపోలేదు.. బడ్జెట్‌ గురించే ఆలోచిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. ఇండియా సూపర్‌ హీరో కాన్సె్‌ప్టతో హృతిక్‌ రోషన్‌ హీరోగా ‘క్రిష్‌’ చిత్రం ఇప్పటివరకూ మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగో భాగం నిర్మాణానికి వచ్చే సరికి కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఇటీవలి కాలంలో ప్రేక్షకుల అంచనాలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. కనుక ఆ స్థాయిలోనే ఖర్చు పెట్టి సినిమా తీస్తే తప్ప వారిని ఆకట్టుకోవడం కష్టమవుతోంది.


హాలీవుడ్‌లో సూపర్‌ హీరోల చిత్రాలను ఐదు వందల మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తీస్తున్నారిప్పుడు. రూ. రెండు మూడొందల కోట్ల బడ్జెట్‌తో తను ‘క్రిష్‌ 4’ చిత్రాన్ని తీస్తే వర్కవుట్‌ అవుతుందా అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు రాకేశ్‌ రోషన్‌. ‘ఇప్పుడు స్ర్కిప్ట్‌ మీద దృష్టి పెట్టా. ఇదివరకులా సినిమాలో పది అద్భుతమైన సీన్లు అని కాకుండా రెండు సూపర్‌ ఎపిసోడ్స్‌ ఉండేలా చూస్తున్నాం’ అని ఆయన వివరించారు.


Also Read- Nagarjuna: నిరాశలో అక్కినేని అభిమానులు

Also Read- Sairam Shankar: ‘పట్టుకుంటే 10 వేలు’ పథకం పెట్టడానికి కారణం ఏంటంటే..

Also Read- Balakrishna Favourite Heroines: బాలయ్య ఫేవరెట్ హీరోయిన్లు ఎవరో తెలుసా..

Also Read- Heroine Rakshita: గుర్తుపట్టలేని స్థితిలో పూరి హీరోయిన్..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 05:15 AM