Happy Journey: కేంద్ర మంత్రి బండి సంజయ్చే 'హ్యాపీ జర్నీ' పోస్టర్
ABN, Publish Date - Jun 23 , 2025 | 04:13 PM
హరిప్రసాద్ కోనే, ఇషాని గోష్ జంటగా చైతన్య కొండా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ జర్నీ’. గంగాధర్ పెద్ద కొండ నిర్మిస్తున్నారు.
హరిప్రసాద్ కోనే(hari Prasad Kone), ఇషాని గోష్ (ishani ghosh) జంటగా చైతన్య కొండా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ జర్నీ'(happy journey) . గంగాధర్ పెద్ద కొండ 9Gangadhar peddakonda) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ఈ చిత్రం కొత్త పోస్టర్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు.
బండి సంజయ్ మాట్లాడుతూ’’ ఈ కథ విన్న తర్వాతనే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేయడానికి అంగీకరించాను. ప్రస్తుత పరిస్థితుల్లో సొసైటీలో అలజడులు ఇతివృత్తంతో ఎమోషనల్ థ్రిల్లర్గా ఈ సినిమా ఉంటుంది. సామాజిక స్పృహ ఉన్న డైరెక్టర్, మంచి అభిరుచి ఉన్న నిర్మాత తీసిన సినిమా ఇది. హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి నా వంతు సపోర్ట్ చేస్తాను’’ అని అన్నారు.