సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మరోసారి సమావేశం

ABN, Publish Date - May 23 , 2025 | 04:08 AM

సినిమాలను థియేటర్లలో ఆడించాలంటే అద్దె విధానం బదులు, పర్సెంటేజీ పద్ధతిని అమలు చేయాలని, లేదంటే జూన్‌ 1 నుంచి థియేటర్లలో షోలు నిలిపివేస్తామని ఎగ్జిబిటర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే...

సినిమాలను థియేటర్లలో ఆడించాలంటే అద్దె విధానం బదులు, పర్సెంటేజీ పద్ధతిని అమలు చేయాలని, లేదంటే జూన్‌ 1 నుంచి థియేటర్లలో షోలు నిలిపివేస్తామని ఎగ్జిబిటర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఏ నిర్ణయం తీసుకుంటారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పటికే విడివిడిగా నిర్మాతలూ, ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. అయినా పరిష్కారం ఓ కొలిక్కి రాకపోవడంతో ఫిల్మ్‌ ఛాంబర్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాతలూ, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో ఓ కమిటీ వేసి మరోసారి సమావేశం నిర్వహించనుంది. శనివారం జరిగే మీటింగ్‌లో ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరకవచ్చని అందరూ భావిస్తున్నారు. జూన్‌ 5న కమల్‌హాసన్‌ నటించిన ‘థగ్‌లైఫ్‌’, జూన్‌ 12న పవన్‌కల్యాణ్‌ నటించిన ‘హరిహర వీరమల్లు’ విడుదలకు సిద్ధమవుతుండడంతో ఈ మీటింగ్‌లో థియేటర్ల విషయంలో ఎగ్జిబిటర్లు తీసుకునే నిర్ణయం కీలకమవ్వనుంది.

Updated Date - May 23 , 2025 | 04:08 AM