సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

డ్రగ్స్‌ కోసం ప్రత్యేక బడ్జెట్‌

ABN, Publish Date - May 23 , 2025 | 03:58 AM

మలయాళ చిత్ర పరిశ్రమలో కొందరు డ్రగ్స్‌ తీసుకుంటున్నారంటూ ఆరోపణలు రావడం.. ఈ క్రమంలో వారిని అరెస్టు చేయడం తెలిసిందే. తాజాగా, మలయాళ పరిశ్రమలో డ్రగ్స్‌ వాడకం...

మలయాళ నిర్మాత శాండ్రా థామస్‌ ఆరోపణ

మలయాళ చిత్ర పరిశ్రమలో కొందరు డ్రగ్స్‌ తీసుకుంటున్నారంటూ ఆరోపణలు రావడం.. ఈ క్రమంలో వారిని అరెస్టు చేయడం తెలిసిందే. తాజాగా, మలయాళ పరిశ్రమలో డ్రగ్స్‌ వాడకం గురించి సంచలన ఆరోపణలు చేశారు నటి, నిర్మాత శాండ్రా థామస్‌. ‘‘చిత్రసీమలో మాదకద్రవ్యాల వాడకం ఎక్కువైంది. సెట్స్‌లో అది ఒక సాధారణ వ్యవహారంగా మారిపోయింది. అంతేకాక, వాటి కోసమే ప్రత్యేకంగా బడ్జెట్‌, గదులను కేటాయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎవరూ కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఓ ఐదు.. పదేళ్ల ముందే మాదకద్రవ్యాల వాడకాన్ని అరికట్టి ఉండాల్సింది. ఇప్పుడు అందరూ మాదకద్రవ్యాలకి అలవాటు పడుతున్నారు. ఈ వ్యవహారంపై నోరువిప్పితే ఎక్కడ తమ ప్రాజెక్టులు ఆగిపోతాయన్న భయంలో నిర్మాతలు ఉన్నారు’’ అని పేర్కొన్నారు.

Updated Date - May 23 , 2025 | 03:58 AM