రెండింతల వినోదం

ABN , Publish Date - Mar 12 , 2025 | 05:46 AM

రాబిన్‌హుడ్‌ సినిమాలో దర్శకుడిగా వెంకీ కుడుముల విశ్వరూపం చూడబోతున్నాం. గతంలో మా ఇద్దరి కలయికలో వచ్చిన భీష్మ చిత్రం కన్నా రాబిన్‌హుడ్‌ లో రెండింతల వినోదం ఉంది. పతాక సన్నివేశాలను చూసి ప్రేక్షకులు..

Robin Hood

‘రాబిన్‌హుడ్‌’ (Robinhood)సినిమాలో దర్శకుడిగా వెంకీ కుడుముల విశ్వరూపం చూడబోతున్నాం. గతంలో మా ఇద్దరి కలయికలో వచ్చిన ‘భీష్మ’ చిత్రం కన్నా ‘రాబిన్‌హుడ్‌’లో రెండింతల వినోదం ఉంది. పతాక సన్నివేశాలను చూసి ప్రేక్షకులు ‘వావ్‌’ అంటారు. ఈ చిత్రంతో మైత్రీ సంస్థ మరో విజయాన్ని అందుకోబోతోంది’ అని హీరో నితిన్‌ అన్నారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం మీడియా సమావేశం నిర్వహించింది.


వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘‘రాబిన్‌హుడ్‌’తో బ్లాక్‌బస్టర్‌ కొట్టబోతున్నాం అనే నమ్మకం ఉంది. అతిథి పాత్రలో నటించిన డేవిడ్‌ వార్నర్‌కు ధన్యవాదాలు. మా నిర్మాతలు నవీన్‌, రవి ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు’ అని చెప్పారు. వెంకీ గారి నుంచి ప్రేక్ష కులు ఆశించే వినోదం ఈ చిత్రంలో ఉంది అని శ్రీలీల అన్నారు. అన్ని వాణిజ్య హంగులతో పాటు మంచి కథ ఉన్న చిత్రమిది అని నిర్మాత వై. రవిశంకర్‌ తెలిపారు.


Also Read: Devotional Thriller: షణ్ముఖ అందరికీ నచ్చుతుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 12 , 2025 | 11:10 AM