Korean Kanakaraju: వరుణ్ తో దక్షా ఐటమ్ సాంగ్....

ABN , Publish Date - Apr 30 , 2025 | 03:16 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు గత కొంత కాలంగా టైం అసలు కలిసి రావడం లేదు. మొన్నటికి మొన్న 'మట్కా' అంటూ పలకరించినా అది కాస్త ఫ్లాప్ అయ్యింది. దాంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫుల్ గా ఫోకస్ పెట్టాడు వరుణ్ తేజ్. తాజాగా వరుణ్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సర్క్యూలేట్ అవుతోంది.

మెగా కుటుంబంలో హీరోలంతా ఓ వైపు ఉంటే.. నేనొక్కడినే మరోవైపు అంటున్నారు వరుణ్ తేజ్ (Varun Tej). అప్పుడప్పుడూ మెగా రూట్ ఫాలో అయినా.. ఎప్పుడూ తనకంటూ సపరేట్ రూట్ వేసుకోడానికే ఇష్టపడుతుంటారు ఈ మెగా ప్రిన్స్. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. ఆ మధ్య రొటీన్ రూట్ ట్రై చేసినా.. ఇప్పుడు మాత్రం సమ్‌థింగ్ డిఫెరెంట్ అంటున్నాడు. ఫలితంతో పని లేకుండా భిన్నమైన సినిమాలు చేస్తూ మెగా ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాడు. స్టోరీ సెలక్షన్ విషయంలో ప్రతీ సినిమాకి వ్యత్యాసం ఉండేలా తన నటనకి మరిన్ని పరీక్షలు పెట్టేలా పాత్రలు ఎంచుకుంటున్నాడు. అలాంటి మెగా హీరో ఇప్పుడు భయపెట్టేందుకు వచ్చేస్తున్నాడు.


వరుసగా సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అవ్వటంతో పాటు మార్కెట్ దెబ్బతినటంతో కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాడు‌. అందుకే 'కొరియన్ కనకరాజు (Korean Kanakaraju) గా హరర్ కామెడీతో నవ్వులతో పాటు భయపెట్టేందుకు వచ్చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేశాడు. ఈ మూవీలో వరుణ్ కు జోడిగా రితికా నాయక్ (Ritika Nayak) నటిస్తోంది. అయితే మరింత గ్లామర్ ను యాడ్ చేసేందుకు మేకర్స్ వేస్తున్న స్కెచ్ హాట్ టాపిక్ గా మారింది.

తన అందచందాలతో కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ దక్షా నాగర్కర్ (Daksha Nagarkar) మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi ) దర్శకత్వం వహిస్తున్న 'కొరియన్ కనకరాజు లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ అందాల భామ వరుణ్ తో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌ లో చిందులు వేయనుందట. హైదరాబాద్ లో వేసిన సెట్ లో సాంగ్ షూట్ జరుగుతుందట. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఖుషి అవుతున్నారు. ఈ ఐటమ్ సాంగ్ సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. దక్షా... 'బంగార్రాజు' (Bangarraju) మూవీలో తన గ్లామర్ తో అలరించింది. మరీ ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య (Naga Chaitanya) తో చేసిన అల్లరి ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంది. అంతేకాక 'జాంబి రెడ్డి। (Zombie Reddy) సినిమాలో కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు వరుణ్ తో ఆడిపాడేందుకు సిద్ధమవుతోంది. ఈ పాట హిట్ అయితే... ఈ గ్లామర్ డాల్ కు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Also Read: Jyothi Poorvaj: తెలుగు, కన్నడ భాషల్లో కిల్లర్

Also Read: 3 Roses Season-2: బోల్డ్ అండ్ గ్లామరస్ గా కుషిత కల్లపు గ్లింప్స్...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 30 , 2025 | 03:19 PM