Jyothi Poorvaj: తెలుగు, కన్నడ భాషల్లో కిల్లర్
ABN , Publish Date - Apr 30 , 2025 | 02:04 PM
జ్యోతి పూర్వజ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న 'కిల్లర్' మూవీ గ్లింప్స్ తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది.
"శుక్ర (Shukra), మాటరాని మౌనమిది (Maatarani Mounamidi), ఏ మాస్టర్ పీస్ (A Masterpiece)" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్నాడు దర్శకుడు పూర్వాజ్ (Poorvaj). తాజాగా అతను 'కిల్లర్' (Killer) పేరుతో సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో తనే హీరో కావడం విశేషం. జ్యోతి పూర్వజ్ (Jyothi Poorvaj) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న రెండో సినిమా ఇది.
తాజాగా 'కిల్లర్' మూవీ గ్లింప్స్ ను తెలుగుతో పాటు కన్నడ భాషల్లో మేకర్స్ రిలీజ్ చేశారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో... ఇలాంటి ఎలిమెంట్స్ తో గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ గ్లింప్స్ ను గమనిస్తే... ఇందులో ప్రాచీన వైమానిక శాస్త్రంలో ఆశ్చర్యపరిచే మానవ మేథస్సు రహస్యాలు వెల్లడించారు. ఆత్మ కలిగిన యంత్రాలు చూస్తారంటూ వైమానిక శాస్త్రంలో చెప్పిందే నిజం కాబోతోందా? అంటూ ఈ గ్లింప్స్ ప్రారంభమైంది. డి బౌండ్ అనే డిజార్డర్ తో బాధపడుతున్న హీరోయిన్ రాయ్, పూర్తిగా కోలుకుంటే పునర్జన్మ ఎత్తినట్లే అని, అప్పుడు ఆమెకు ఎదురు నిలవడం ఎవరి వల్లా కాదని గ్లింప్స్ లో చూపించారు. సూపర్ షీ క్యారెక్టర్ లో జ్యోతి రాయ్ చేసిన స్టన్నింగ్ యాక్షన్, సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ హైలైట్ గా కానున్నాయి. లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా రూపొందించినట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. మొదలెడదామా అంటూ గ్లింప్స్ చివరలో హీరో, డైరెక్టర్ పూర్వాజ్ పవర్ ఫుల్ డైలాగ్ తో ఆకట్టుకున్నారు. హై క్వాలిటీ మేకింగ్, వీఎఫ్ఎక్స్ గ్లింప్స్ కు ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకుంటున్న 'కిల్లర్' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Also Read: 3 Roses Season-2: బోల్డ్ అండ్ గ్లామరస్ గా కుషిత కల్లపు గ్లింప్స్...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి