సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

CV Anand: పోలీస్ కమీషనర్ CV ఆనంద్ వదిలిన  'మిస్స్టీరియస్' పాట

ABN, Publish Date - Aug 14 , 2025 | 05:51 PM

హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ CV ఆనంద్ గారి చేతుల మీదుగా 'మిస్స్టీరియస్' సినిమా నుంచి 'అడుగు అడుగునా'  అనే పాటను విడుదల చేశారు.

హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ CV ఆనంద్ (Cv Anand) గారి చేతుల మీదుగా 'మిస్స్టీరియస్' (Miss Terious) సినిమా నుంచి 'అడుగు అడుగునా'  అనే పాటను విడుదల చేశారు. అంకితభావంతో పనిచేసే పోలీసు అధికారిపై చిత్రీకరించబడిన పాట  ఇది. ఈ పాటను వీక్షించిన  CV ఆనంద్ గారు పాట పాడిన  MLR కార్తీకేయన్ ని మెచ్చుకుంటూ పాటని అద్భుతంగా చిత్రకరించారని  కొనియాడారు. పోలీసుల నిబద్ధతని అద్భుతంగా రాసి,  పాటకి సంగీత దర్శకత్వం వహించిన ML రాజా ని అభినందించారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని కొత్త వరవడి లో చూపించే ప్రయత్నం చేసిన దర్శకులు మహీ కోమటిరెడ్డి ని, అమెరికాలో స్థిరపడి కూడా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ సినిమాని నిర్మించిన జయ్ వల్లందాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని చెప్పారు. ఈ కార్యక్రమం లో హీరో రోహిత్ సాహిని, గౌతమ్,  దర్శకులు మహి కోమటిరెడ్డి, నిర్మాత జయ్ వల్లందాస్, సహా నిర్మాత రామ్ ఉప్పు (బన్నీ రామ్) మరియు ఇతరులు పాల్గొన్నారు.


ఎంతో బిజీ గా ఉండి కూడా మా సినిమా లిరికల్ సాంగ్ ని విడుదల చేసినందుకు కమీషనర్ CV ఆనంద్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నామని  నిర్మాత జయ్ వల్లందాస్ మరియు దర్శకులు మహి కోమటిరెడ్డి చెప్పారు. ఈ లిరికల్ పాట వీడియో  ఆశ్లీ మ్యూజిక్ ఛానెల్ లో అందుబాటులో ఉంటుందని  నిర్మాత జయ్ వల్లందాస్ అన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 05:51 PM