Chiranjeevi Mega157 Movie: సెట్‌లోకి చిరు
ABN, Publish Date - May 24 , 2025 | 01:51 AM
చిరంజీవి నటిస్తున్న మెగా 157 సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వినోదభరితమైన పాత్రలో చిరంజీవి కనిపించనున్నారు.
చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (మెగా 157- వర్కింగ్ టైటిల్) రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చిరంజీవితో పాటు ఇతర నటీనటులు షూటింగ్‌లో పాల్గొనగా కీలక సన్నివేశాలను అనిల్ రావిపూడి తెరకెక్కించారు. తనదైన శైలిలో సాగే విభిన్న కథాంశంతో ఈ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి పాత్ర వినోదభరితంగా ఉండనుంది. ఈ చిత్రంలో నయనతార చిరంజీవికి జోడీగా నటిస్తున్నారు. షైన్ స్ర్కీన్స్ బేనర్‌పై సాహూ గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి.