సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తొలి ప్రేమే తోపు కాదే

ABN, Publish Date - Jun 04 , 2025 | 05:26 AM

కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘చెన్నై లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. రవి నంబూరి దర్శకత్వంలో...

కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘చెన్నై లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. రవి నంబూరి దర్శకత్వంలో సాయిరాజేశ్‌, ఎస్కేన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌, గ్లింప్స్‌ని దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా విడుదల చేశారు. ‘తొలి ప్రేమేం తోపు కాదు.. ఫస్ట్‌ లవ్‌ ఫెయిలైతే బెస్ట్‌ లవ్‌ ఎక్కడో మొదలవుతుంది’ అని చెబుతూ సాగిన గ్లింప్స్‌ ఆకట్టుకుంటోంది. అంతం వరకూ అనంతమై సాగే ఈ జీవితంలో తొలి ప్రేమ ఒక మజిలీ మాత్రమే అనీ, అదే తుది కాదనే కాన్సె్‌ప్టను ఈ గ్లింప్స్‌ ద్వారా మేకర్స్‌ అందంగా తెలియజేశారు. ఈ గ్లింప్స్‌కు ‘తొలి ప్రేమే తోపు కాదే తోపు కాదే..’ అంటూ సంగీత దర్శకుడు మణిశర్మ బీజీఎం కంపోజ్‌ చేశారు.

Updated Date - Jun 04 , 2025 | 05:26 AM