Hit -3: చైతూ జొన్నలగడ్డకు మరిన్ని అవకాశాలు...

ABN, Publish Date - May 12 , 2025 | 04:14 PM

'బబుల్ గమ్' మూవీలో కామెడీని పండించిన సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతూ... తాజా చిత్రం 'హిట్ -3'లో ఎస్సై దివాకర్ గా అలరించాడు.

ప్రముఖ యాంకర్ సుమ (Suma), నటుడు రాజీవ్ కనకాల (Rajeevi Kanakala) తనయుడు రోషన్ (Roshan) హీరోగా నటించిన సినిమా 'బబుల్‌గమ్' (Bubblegum). ఈ చిత్రంలో హీరో తండ్రి యాదగిరి పాత్రలో నటించాడు చైతూ జొన్నలగడ్డ (Chaithu Jonnalagadda). వైవిధ్యమైన వాచకంతో అందరి ప్రశంసలు అతను పొందాడు. నటుడిగా తనకంటూ ఓ సపరేట్ కామెడీ టైమింగ్, ట్రాక్‌తో పలువురిని ఆకట్టుకున్నాడు. తాజాగా నాని ‘హిట్ 3’ చిత్రంలో ఎస్సై దివాకర్ పాత్రను పోషించిన చైతూ దానికి చక్కని న్యాయం చేకూర్చాడు. 'అబ్ కీ బార్.. అర్జున్ సర్కార్' అనే డైలాగ్‌తో థియేటర్లను దద్దరిల్లేట్టు చేశాడు. 'బబుల్‌గమ్' చిత్రంలో కామెడీ పాత్రతో మెప్పించిన చైతూ... 'హిట్ 3' లో సీరియస్ పాత్రతోనూ మెప్పించడం విశేషం.


హీరో నాని (Nani), చైతూ జొన్నలగడ్డ మధ్య 'హిట్ -3' (Hit -3) సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ వచ్చే సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నటుడిగా చైతూ జొన్నలగడ్డ మరోసారి ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, ఈటీవీ విన్‌లో ఒక ప్రాజెక్ట్, ఓ హిందీ సినిమా, మరో రెండు క్రేజీ, భారీ చిత్రాల్లోనూ నటిస్తున్నట్టు ఆయన తెలిపారు.

Also Read: Bhadra: బోయపాటి శ్రీను కు ఇరవై ఏళ్ళు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 12 , 2025 | 04:17 PM