మరింత శక్తిమంతమైన పాత్రలో బాలకృష్ణ
ABN, Publish Date - Jun 10 , 2025 | 05:39 AM
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అఖండ 2’ టీజర్ వచ్చేసింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ పాత్ర...
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అఖండ 2’ టీజర్ వచ్చేసింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ పాత్ర మొదటి భాగంలో కంటే మరింత శక్తిమంతంగా కనిపిస్తోంది. ‘నా శివుడి అనుమతి లేనిదే యముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా..’ అంటూ ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగులు, అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే పోరాట సన్నివేశాలు,
థమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. దసరా సందర్భంగా సెప్టెంబరు 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బోయపాటి శ్రీను దర్శకుడు. బాలకృష్ణ కూతురు తేజస్విని సమర్పణలో రామ్ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్నారు. ఎడిటర్: తిమ్మరాజు, డీఓపీ: సి.రామ్‌ప్రసాద్, సంతోష్ డీ.డెటాకే. కాగా, బాలకృష్ణ, బోయపాటి కాంబోలో ఇదివరకు వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్న విషయం తెలిసిందే.