Badmashulu : అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా
ABN, Publish Date - Jun 05 , 2025 | 02:55 AM
శంకర్ నిర్మించిన చిత్రం ‘బద్మాషులు’. మహేశ్ చింతల, విద్యాసాగర్ కీలకపాత్రలు పోషించారు. ఈ శుక్రవారం చిత్రం విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు...
శంకర్ చేగూరి దర్శకత్వంలో బి. బాలకృష్ణ, రమా
శంకర్ నిర్మించిన చిత్రం ‘బద్మాషులు’. మహేశ్ చింతల, విద్యాసాగర్ కీలకపాత్రలు పోషించారు. ఈ శుక్రవారం చిత్రం విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘నూతన నటీనటులతో సరికొత్త తరహాలో కామెడీ థ్రిల్లర్‌గా ‘బద్మాషులు’ చిత్రాన్ని రూపొందించారు’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక విభిన్నమైన వినోదాత్మక చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు. వినోదంతో పాటు మంచి సందేశం ఉన్న చిత్రమిదని నిర్మాత తెలిపారు.