Raja Dussa Director: యదార్థ సంఘటన ఆధారంగా
ABN, Publish Date - May 24 , 2025 | 01:27 AM
వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న 'అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే' చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కార్తీక్‌రాజు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు.
కౌసల్యా కృష్ణమూర్తి, అథర్వ చిత్రాలతో నటుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కార్తీక్‌రాజు. ఆయన కథానాయకుడిగా కొత్త చిత్రం ప్రారంభమైంది. శుక్రవారం పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభించారు. తొలి షాట్‌కు సురేశ్‌బాబు క్లాప్ ఇచ్చారు. హీరో చైతన్య కెమెరా స్విచ్చాన్ చేశారు. భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రాజా దుస్సా దర్శకత్వంలో గాలి కృష్ణ నిర్మిస్తున్నారు. కాజల్ చౌదరి కథానాయిక. 1980ల్లో వరంగల్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు తెలిపారు.