అఖండ 2 కొత్త షెడ్యూల్
ABN, Publish Date - Jun 16 , 2025 | 04:44 AM
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. 2021లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘అఖండ’కు...

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. 2021లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘అఖండ’కు ఇది సీక్వెల్. ఇటీవలె విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సినిమా కీలక షెడ్యూల్‌ను నేటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించనున్నట్లు తెలిపారు మేకర్స్. బాలకృష్ణతో సహా ప్రధాన పాత్రధారులందరూ పాల్గొననున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పణలో రామ్ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్నారు. సంయుక్త కథానాయిక. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరా సందర్భంగా సెప్టెంబరు 25న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.