సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Brahmanda: ఒగ్గు కళాకారుల నేపథ్యంలో  'బ్రహ్మాండ'

ABN, Publish Date - Aug 26 , 2025 | 04:28 PM

ఆమని, బలగం జయరాం, కొమరక్క, బన్నీ రాజు  కీలక పాత్రధారులుగా రాబోతున్న చిత్రం  'బ్రహ్మాండ'.  రాంబాబు దర్శకత్వంలో దాసరి సురేష్  నిర్మించిన ఈ చిత్రం  శుక్రవారం రిలీజ్ కాబోతుంది

ఆమని(Aamani), బలగం జయరాం(balagam Jayaram), కొమరక్క, బన్నీ రాజు  కీలక పాత్రధారులుగా రాబోతున్న చిత్రం  'బ్రహ్మాండ' (Brahmanda)  రాంబాబు దర్శకత్వంలో దాసరి సురేష్  నిర్మించిన ఈ చిత్రం  శుక్రవారం రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. 

ఆమని మాట్లాడుతూ 'ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన సినిమా  ఇది . ప్రేక్షకులకి మంచి అనుభూతి కల్గిస్తుంది. మంచి సినిమా డైరెక్ట్ చేసిన దర్శకుడు మన మధ్య లేకపోవడం బాధాకరం' అని అన్నారు. 

బన్నీ రాజు మాట్లాడుతూ 'ఈ సినిమాలో నాది అద్భుతమైన పాత్ర. సినిమా నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది. ఈ సినిమాను శుక్రవారం రిలీజ్ చేయబోతున్నాం. అందరూ చూసి ఆదరించండి. ముఖ్యంగా క్లైమాక్స్ ని మిస్ చేయకండి. అద్భుతమైన అనుభూతిని పొందుతారు' అన్నారు.  
 
నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ 'స్క్రిప్ట్ దశలో  మేము  ఏదైతే అనుకున్నామో అదే తెరపైకి వచ్చింది. ఆమని, బలగం జయరాం,  కొమురక్క గార్ల సహకారం మేము మరవలేము అని చెప్పారు .

 

Updated Date - Aug 26 , 2025 | 05:08 PM