సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

War 2: పఠాన్ పద్ధతినే ఫాలో అవుతున్న వార్ 2 మేకర్స్

ABN, Publish Date - Jun 05 , 2025 | 05:09 PM

దేవర(Devara) తరువాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) నటిస్తున్న చిత్రం వార్ 2(War 2).

War 2

దేవర(Devara) తరువాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) నటిస్తున్న చిత్రం వార్ 2(War 2). ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. అప్పటినుంచే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఎన్టీఆర్ వార్ 2 తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్(Hrithik Roshan), టైగర్ ష్రాఫ్(Tiger Shroff) కలిసి నటించిన వార్ సినిమా 2019 లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా వార్ 2 మొదలయ్యింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్నారు. వార్ 2 ను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్యచోప్రా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే వార్ 2 నుంచి రిలీజైన పోస్టర్స్, ఎన్టీఆర్ బర్త్ డే కి రిలీజ్ చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా అంచనాలను మరింత పెంచేసింది. ఆగస్టు 14 న వార్ 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ మొట్ట మొదటి బాలీవుడ్ సినిమా కావడంతో నందమూరి ఫ్యాన్స్.. తెలుగులో వార్ 2 ను ఎవరు రిలీజ్ చేస్తారా.. ? అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే వారికి నిరాశే ఎదురయ్యింది. ఎందుకంటే YRF ఈసారి కూడా తెలుగు థియేట్రికల్ హక్కులను.. ఏ తెలుగు ప్రొడక్షన్ హౌస్ కు ఇవ్వకుండా సొంతంగా తామే రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఇదేమి YRF కి కొత్త కాదు. ఇప్పటికే పఠాన్ విషయంలో ఇదే పద్దతిని అవంబించింది. పఠాన్ తెలుగు థియేట్రికల్ హక్కుల కోసం అప్పుడు చాలా సంస్థలే పోటీపడ్డాయి. వాటన్నింటిని కాదని.. ఆదిత్య చోప్రా సొంతంగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసాడు. ఇప్పుడు వార్ 2 ను కూడా అలాగే చేయనున్నాడు. కేవలం తెలుగులోనే కాదు మిగతా అన్ని భాషల్లో కూడా సొంతంగానే వార్ 2 ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అన్ని భాషల్లో ప్రమోషన్స్ కూడా వారే దగ్గరుండి చేయనున్నారట. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Jun 05 , 2025 | 05:09 PM