ED summons: ఊర్వశీ రౌతెలతో పాటు మాజీ ఎంపీకి ఈడీ సమన్లు..
ABN, Publish Date - Sep 14 , 2025 | 10:54 PM
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ (betting appa) ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలకు నిద్ర లేకుండా చేస్తోంది.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ (betting appa) ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలకు నిద్ర లేకుండా చేస్తోంది. యాప్‌లను ప్రమోట్ చేసిన చాలామంది సినీ తారలు ఈడీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ కేసులో ఇంకా కొందరిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా సినీ ఇద్దరు సెలబ్రిటీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. అందులో ఒకరు ఊర్వశి రౌతేలా (Urvashi Routela).
నోటీసులు పంసిన అధికారులు ఈ నెల 16న ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. మరో నటి, మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి (Mimi Chakraborthy) కూడా సమన్లు అందాయి. ఈ నెల 15న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు నటీమణులు కూడా జాబితాలో చేరడంతో హాట్‌టాపిక్‌గా మారింది.