Tollywood: హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది ఎవరో తెలుసా...

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:58 PM

స్టార్ హీరోసే కాదు పారితోషికాల్లో స్టార్ హీరోయిన్స్ సైతం అదరహో అనిపిస్తున్నారు. ఈ డికేడ్ లో మన టాలీవుడ్ నుండి హయ్యెస్ట్ రెమ్యూనరేషన్స్ అందుకున్న హీరోయిన్స్ ఎవరంటే - ముంబై ముద్దుగుమ్మలే ముందుగా కనిపిస్తారు. తరువాతే సౌత్ భామలు. మరి ఏ బాలీవుడ్ భామ ఎంత పట్టేశారో చూద్దాం.

Tollywood highest paid heroines

మన సౌత్ లో టాప్ హీరోయిన్ గా సాగుతోన్న నయనతార (Nayantara) సినిమాకు 12 కోట్లు పుచ్చుకుంటారు. ఆమె తరువాతి స్థానంలో త్రిష (Trisha) ఉందని తెలుస్తోంది. వీరిని చూస్తేనే అబ్బో అనుకుంటారు మనవాళ్ళు. అయితే ఉత్తరాది భామలు మాత్రం పారితోషికాలు అందుకోవడంలో పగలే చుక్కలు చూపిస్తారని టాలీవుడ్ టాక్ ! రాజమౌళి మల్టీస్టారర్ 'ట్రిపుల్ ఆర్'లో నటించిన అలియా భట్ (Aliabhatt) కు ఆ మూవీ ద్వారా పాతిక కోట్లు ముట్టిందని సమాచారం. హిందీలో ఒక సినిమాకు 15 నుండి 25 కోట్లు రెమ్యూనరేషన్ అందుకొనే అలియా భట్ 'ట్రిపుల్ ఆర్' (RRR) మూవీ క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో అంత డిమాండ్ చేసిందని తెలుస్తోంది. అలియా నటించడం వల్ల ఉత్తరాదిన సైతం 'ట్రిపుల్ ఆర్'కు మార్కెట్ లభిస్తుందన్న అభిలాషతోనే ఆమెను నాయికగా ఎంచుకున్నారట. అలియా నటించడం వల్ల నార్త్ లోనూ 'ట్రిపుల్ ఆర్' భలేగా చిందేయించిందని చెప్పవచ్చు.


ప్రభాస్ 'సాహో'లో నటించిన శ్రద్ధా కపూర్, 'గేమ్ చేంజర్'లో నటించిన కియారా అద్వాణీ సైతం 15 కోట్ల దాకా పట్టేశారని తెలుస్తోంది. వారి కథ అలా ఉంటే ఒకప్పుడు మన సౌత్ లో 'తలైవి' వంటి ప్రాజెక్ట్ లో నటించడానికి కంగనా రనౌత్ 30 కోట్లు అందుకుందని టాక్. ఆ స్థాయిలో సౌత్ నుండి భారీ మొత్తం పట్టేసిన భామ మరొకరు కనిపించడం లేదని అందరూ అంటూ ఉంటారు. అయితే ఇదిగో నేనున్నాను అంటూ ఇప్పుడు ప్రియాంక చోప్రా వచ్చేసింది. రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా రూపొందుతోన్న 'వారణాసి'లో ప్రియాంక హీరోయిన్.. ఇందులో నటించడానికి ఆమెకు అన్నీ కలిపి 30 కోట్లు అందజేస్తున్నారని విశేషంగా వినిపిస్తోంది.


ప్రియాంక చోప్రా (Priyanka Chopra) స్థాయిలోనే దీపికా పదుకొణే (Deepika Padukone) కూడా పుచ్చుకుంటూ ఉంటుంది. అయితే ప్రియాంకకు ఇంటర్నేషనల్ స్టార్ ముద్ర ఉంది. దీపికకు అంత సీన్ లేదు. అయినా దీపిక కూడా టాలీవుడ్ లో భారీ పారితోషికాన్నే డిమాండ్ చేసింది. అందువల్లే ఆమెను సందీప్ రెడ్డి వంగా తన 'స్పిరిట్' నుండి, నాగ్ అశ్విన్ రాబోయే 'కల్కి 2898 ఏడి' సీక్వెల్ నుండి తప్పించినట్టు సమాచారం. పైగా స్టార్ హీరోస్ లాగా దీపిక కూడా తాను నటించే సౌత్ మూవీస్ ప్రాఫిట్స్ లో షేర్ ఇవ్వాలని డిమాండ్ చేసిందట. ఆ కారణంగానూ దీపికను మనవాళ్ళు వద్దనుకున్నట్టు తెలుస్తోంది. 'కల్కి 2898 ఏడి'లో నటించినందుకు దీపిక 20 కోట్లు డిమాండ్ చేస్తే మేకర్స్ 18 కోట్లు ఇచ్చారని టాక్ ! ఏది ఏమైనా ఉత్తరాన మెరిసే భామలను దక్షిణాది చిత్రాల్లో బుక్ చేసుకుంటే పదిహేను కోట్లకు పైగా సమర్పించుకోక తప్పదని అంటున్నారు సినీజనం. మరి పాన్ ఇండియా మూవీస్ తీస్తూ నార్త్ హీరోయిన్స్ ఉండాలని కోరుకొనే మేకర్స్ రాబోయే రోజుల్లో ఎలా సాగుతారో చూడాలి.

Also Read: Tollywood: తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మహాధర్నా

Also Read: Hyper Aadhi: హీరోల మీద ట్రోల్స్.. ఇచ్చిపడేసిన హైపర్ ఆది

Updated Date - Nov 19 , 2025 | 05:03 PM