Amara Kavyam: ధనుష్ అమర కావ్యం.. ఎప్పుడొస్తుందంటే
ABN, Publish Date - Nov 23 , 2025 | 07:40 PM
ఈ మధ్య తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు పాన్ ఇండియా సినిమా అని చెప్పి అన్ని భాషల్లో ఒకే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. హిందీలో సినిమా చేస్తే.. తెలుగులో, తమిళ్ లో కూడా అదే హిందీ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.
Amara Kavyam: ఈ మధ్య తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు పాన్ ఇండియా సినిమా అని చెప్పి అన్ని భాషల్లో ఒకే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. హిందీలో సినిమా చేస్తే.. తెలుగులో, తమిళ్ లో కూడా అదే హిందీ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఎక్కువ తమిళ్ సినిమాలకు ఇలా జరుగుతూ ఉంటుంది. దీనివలన ఆ టైటిలే సరిగ్గా అర్ధం కాక వేరే భాష ఆడియెన్స్ సినిమాకు వెళ్లడం మానేస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ (Dhanush) ఆ తప్పు చేయలేదు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. తాజాగా ఆయన బాలీవుడ్ లో నటించిన చిత్రం 'తేరి ఇష్క్ మే'. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధనుష్ సరసన కృతి సనన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా హిందీలోనే కాకుండా అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. దీంతో మిగతా భాషల్లో ఆ సినిమా కథకు తగ్గట్లు టైటిల్ ను పెట్టారు. తేరి ఇష్క్ మే సినిమా తెలుగులో అమర కావ్యం అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ఈ టైటిల్ తెలుగువారికి చాలా అంటే చాలా ఎమోషనల్ అని చెప్పొచ్చు. ప్రేక్షకులు ఈజీగా ఈ సినిమాను ఓన్ చేసుకోవడానికి ఈ టైటిల్ ఒక్కటే చాలు! నవంబర్ 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి అమర కావ్యం తెలుగువారిని ఎలా మెప్పిస్తుందో చూడాలి.