IFFI 2025: 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో 'ది బెంగాల్ ఫైల్స్'

ABN , Publish Date - Nov 08 , 2025 | 11:02 AM

బాలీవుడ్  దర్శకుడు  వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన 'ది బెంగాల్ ఫైల్స్' సినిమా 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్‌ పనోరమ విభాగంలో అధికారికంగా ఎంపికైంది.

The Bengal Files for Indian Panorama

బాలీవుడ్  దర్శకుడు  వివేక్ అగ్నిహోత్రి (vivek agnihothri) దర్శకత్వంలో తెరకెక్కిన 'ది బెంగాల్ ఫైల్స్' (The bengal files) సినిమా 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్‌ పనోరమ విభాగంలో (indian Panorama) అధికారికంగా ఎంపికైంది. ఈ విషయాన్నీ వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 

'వాస్తవాల్ని తెరపై ఆవిష్కరించడానికి ఇండియన్ సినిమాలో ఇంకా భాగముందని నిరూపించింది' అని తన  పోస్ట్ లో పేర్కొన్నారు. మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలైంది. 

ఇండియన్‌ పనోరమ విభాగంలో దక్షిణాది నుంచి కూడా కొన్ని చిత్రాలు ఎంపికయ్యాయి. వెంకటేశ్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం'తోపాటు  మోహన్‌లాల్‌ నటించిన ‘తుడరుమ్‌’కు కూడా అవకాశం దక్కింది. ఉత్తమ పరిచయ దర్శకుడు విభాగంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికిగాను తెలుగు దర్శకుడు యదు వంశీ నామినేట్‌ అయ్యారు.  ఈ నెల 20 నుంచి మొదలు కానున్న ఈ వేడుక గోవా వేదికగా జరగనుంది.

ALSO READ: Nayagan Case: ‘నాయగన్‌ స్టోరీ సీన్‌ బై సీన్‌ చెప్పగలను.. హైకోర్టు న్యాయమూర్తి

Akhanda 2: అఖండ తాండవం ప్రోమో వచ్చేసిందిరోయ్..

Updated Date - Nov 08 , 2025 | 11:22 AM