Ramayana: రామాయణ.. మరింత ప్రతిష్ఠాత్మకం.. మేకర్స్‌ అప్‌డేట్‌

ABN , Publish Date - Jul 06 , 2025 | 02:13 PM

బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా ‘రామాయణ’. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్‌ నటిస్తున్నారు. ఇటీవల గ్లింప్స్‌ విడుదల చేసి సినిమాపై హైప్‌ పెంచారు.

‘రామాయణం మన వాస్తవం.. మన చరిత్ర’ అంటూ గ్లింప్స్‌తో సినిమాపై ఆసక్తి పెంచారు దర్శకుడు నితేశ్‌ తివారీ(Nitesh Tiwari). ఆయన దర్శకత్వంలో బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా ‘రామాయణ’ (Ramayana). ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir kapoor), సీతగా సాయిపల్లవి(Sai pallavi), రావణుడిగా యశ్‌ నటిస్తున్నారు. ఇటీవల గ్లింప్స్‌ విడుదల చేసి సినిమాపై హైప్‌ పెంచారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని మేకర్స్‌ పంచుకున్నారు. ఈ సినిమా కోసం 10వేల మంది నటీనటులు, టెక్నీషియన్స్‌ పనిచేసినట్లు  చెప్పారు. ఈ మేకర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు.




‘‘రాబోయే ‘రామాయణ’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒక్క వేదికపైకి తీసుకొచ్చింది. హాలీవుడ్‌ భారీ ప్రొడక్షన్స్‌ అయిన ‘అవతార్‌’, ‘డ్యూన్‌’ సినిమాలకు పనిచేసిన వారికంటే రెండింతల మంది ఈ దృశ్య కావ్యంలో భాగమయ్యారు. ఒకానొక దశలో 4వేల మంది కలిసి పనిచేయడం విశేషం’’ అని చిత్ర బృందం పేర్కొంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా బడ్జెట్‌ రూ.1600 కోట్లని.. మొదటి భాగం రూ.900 కోట్లతో రానుందని.. రెండోది రూ.700 కోట్లని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇప్పటికే మొదటి పార్ట్‌ షూటింగ్‌ పూర్తయింది. అందుకు సంబంధించిన వీడియోలో నెట్టింట  వైరల్‌ అవుతున్నాయి. 2026 దీపావళికి మొదటి భాగాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రామాయణ: పార్ట్‌2’ 2027 దీపావళికి విడుదల కానుంది.

Updated Date - Jul 06 , 2025 | 02:13 PM