Anupam Kher: తన్వీ చిత్రం విడుదల తేదీ ఖరారు

ABN, Publish Date - May 19 , 2025 | 05:33 PM

అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన 'తన్వీ ది గ్రేట్' మూవీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైంది. ఈ చిత్రాన్ని జూలై 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమై సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకుంది 'తన్వీ ది గ్రేట్' (Tanvi The Great) చిత్రం. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) 'ఓం జై జగదీశ్‌' తర్వాత దర్శకత్వం వహించిన రెండో సినిమా ఇది. కాన్స్ ఫెస్టివల్ (Cannes Festival) లో వివిధ దేశాలకు చెందిన వారంతా సినిమా చూసి అభినందన జల్లులు కురిపించారని, వారి ప్రశంసలతో తన మనసులో ఉన్న ఒత్తిడి మొత్తం తొలగిపోయిందని అనుపమ్ ఖేర్ తెలిపారు. ఈ సినిమాను భారత దేశంలో జులై 18న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.


గత మాసంలో 'తన్వీ ది గ్రేట్' టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రొటీన్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉందంటూ వీక్షకులు అభినందించారు. పర్వత సానువుల్లో జీవించే తన్వీ కథ ఇది. స్పెషల్ చైల్డ్ అయిన తన్వీ స్కూల్ స్టూడెంట్. అయితే ఆమెకు పియానో వాయించడమన్నా, ఫోటోగ్రఫీ అన్నా ఎంతో ఇష్టం. అటువంఇ స్పెషల్ చైల్డ్ ఆర్మీలో జాయిన్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే సినిమాలోని కీలకాంశం. ఇందులో తన్వీ పాత్రను శుభాంగి దత్ (Shubhangi Dutt) పోషించింది. ఆమెను తన యాక్టింగ్ స్కూల్ నుండి అనుపమ్ ఖేర్ ఎంపిక చేశారు. ఇతర ప్రధాన పాత్రలను ఇయాన్ గ్లేన్, జాకీ ష్రాఫ్ (Jackie Shroof), అరవింద్ స్వామి (Aravind Swami), కరన్ టక్కర్, నాజర్ పోషించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి (MM Keeravani) సంగీతాన్ని అందించారు.

Also Read: ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో...

Also Read: Vishal - Dhansika: తప్పకుండా ప్రేమ వివాహమే.. క్లారిటీ ఇచ్చిన హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 19 , 2025 | 05:34 PM