ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో..
ABN , Publish Date - May 19 , 2025 | 03:32 PM
ఘట్టమనేని కుటుంబం (Ghattamaneni Family) నుంచి మరో యువ నటుడు ఇండస్ట్రీలోకి రానున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే!
ఘట్టమనేని కుటుంబం (Ghattamaneni Family) నుంచి మరో యువ నటుడు ఇండస్ట్రీలోకి రానున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు నటుడు రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ (Jaya Krishna) సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే అతను హీరోగా కొత్త సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని టాక్. వైజయంతి మూవీస్, ఆనంద్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ నిర్మించే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే జయకృష్ణ ఫొటోషూట్‌లో పాల్గొన్నారట. యాక్టింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారట. మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు 1974లో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ‘అల్లూరి సీతారామరాజు’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాల్లో నటించి తండ్రి వారసత్వాన్ని చాటారు. ‘నా ఇల్లే నా స్వర్గం’, ‘అన్నా చెల్లెలు’, ‘పచ్చతోరణం’, ‘ముగ్గురు కొడుకులు’, ‘సామ్రాట్’, ‘చిన్ని కృష్ణుడు’, ‘కృష్ణగారి అబ్బాయి’, ‘బజార్ రౌడీ’, ‘కలియుగ కర్ణుడు’, ‘బ్లాక్ టైగర్’, ‘కలియుగ అభిమన్యుడు’ ఇలా 17 చిత్రాల్లో నటించారు. తన సోదరుడు మహేశ్‌బాబు నటించిన ‘అతిథి’, ‘అర్జున్’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అనారోగ్యం కారణంగా 2022లో రమేశ్‌బాబు కన్నుమూశారు.