Tamannaah Bhatia: శాంతారామ్.. భార్యగా తమన్నా! మిల్కీ బ్యూటీకి.. అదిరిపోయేఛాన్స్
ABN , Publish Date - Dec 09 , 2025 | 12:38 PM
ప్రముఖ నటి తమన్నా 'వి. శాంతారామ్' బయోపిక్ లో నటిస్తోంది. శాంతారామ్ రెండో భార్య జయశ్రీగా నటించే అవకాశం ఆమెకు దక్కింది.
భారతదేశం గర్వించే చిత్రాలను తెరకెక్కించిన దర్శక నిర్మాత నటుడు వి. శాంతారాం (V. Shantaram). ఆయన జీవిత గాథను అభిజీత్ శిరీష్ దేశ్ పాండే తెరకెక్కిస్తున్నాడు. ఇందులో శాంతారామ్ పాత్రను బాలీవుడ్ నటుడు సిద్దాంత్ చతుర్వేది (Siddhant Chaturvedi) పోషిస్తున్నాడు. అయితే శాంతారామ్ రెండవ భార్య, జయశ్రీ (Jayasri) పాత్రను తమన్నా భాటియా (Tamannaah Bhatia) పోషించబోతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు రాహుల్ కిరణ్ శాంతారామ్, సుభాష్ కాలే, సరిత అశ్విన్ వర్దే తెలిపారు.

ఈ సందర్భంగా తమన్నా రెట్రో గెటప్ పోస్టర్ ను సైతం విడుదల చేశారు. నటి జయశ్రీ అప్పట్లో 'డాక్టర్ కుట్నీస్ కి అమర్ కహానీ, శాకుంతల, చంద్ర రావ్ మోర్, దహేజ్' తదితర చిత్రాలలో నటించి, నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలనాటి నటి పాత్రను తాను చేయడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని, తనకు ఈ పాత్ర ఇచ్చిన 'వి శాంతారాం' మేకర్స్ కు ధన్యవాదాలు తెలియచేస్తున్నానని తమన్నా చెప్పింది. జయశ్రీ పాత్రకు సంబంధించిన ఫోటోను తమన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సమయంలో తమన్నాకు 'వి. శాంతారాం' బయోపిక్ లో ఛాన్స్ రావడం అరుదైన విషయమని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
Also Read: Toxic: మరో వంద రోజుల్లో.. యశ్ 'టాక్సిక్' విధ్వంసం ఖాయం!
Also Read: Nivetha Pethuraj: బాయ్ ఫ్రెండ్‌కు.. గుడ్ బై! ఎంగేజ్మెంట్.. క్యాన్సిల్ చేసుకున్న నివేదా పేతురాజ్