Tamannaah Bhatia: తమన్నా.. ఇలా తయారైందేంటి! దాచాల్సింది ఏమీ లేదు.. అంతా ఓపెన్
ABN, Publish Date - Sep 21 , 2025 | 02:47 PM
తమన్నా భాటియా ఐటమ్ సాంగ్స్‌తో బాలీవుడ్‌లో కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తాజాగా ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్ Bads of Bollywoodలో చేసిన "Ghafoor" పాట ఆమె బోల్డ్ లుక్‌తో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల సినిమాల కన్నా వివిధ కారణాలతో వార్తల్లో ప్రధానంగా నిలుస్తున్న బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia). ఐదేండ్ల క్రితం సౌత్‌లో టాప్‌స్టార్‌గా వరుస అవకాశాలతో ఓ వెలుగు వెలిగిన ఈ చిన్నది ఆ తర్వాత ఛాన్సులు సన్నగిల్లడంతో క్రమంగా బాలీవుడ్‌కు వెళ్లి సెటిల్ అయింది. అక్కడా ఒకటి రెండు స్ట్రెయిట్ చిత్రాలు చేసిన కెరీర్ స్పీడందుకోక పోవడంతో ఐటమ్ సాంగ్స్, వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టి 2 రెండు సిరీస్‌లు 4 పాటలు అన్నచందంగా జెట్ స్పీడుగా దూసుకెళుతోంది. ప్రధానంగా బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్‌కు కేరాఫ్ ఆడ్రస్‌గా నిలిచింది.
ఈ నేపథ్యంలో సౌత్ కన్నా హిందీలోనే ఒక దాని తర్వాత మరో ఐటమ్ సాంగ్స్ చూస్తూ అక్కడి జనాలకు కలల రాణిగా మారింది. అంతేకాదు ప్రతి పాటలో అంతకుమించి అనే రేంజ్‌లో అంగాంగ ప్రదర్శణ చేస్తూ ఆల్రెడీ ఉన్న కథానాయికలకు, కొత్తగా వస్తున్న వారికి అదిరే పోటీ ఇస్తుంది. ఒక్కసారి సాంగ్‌లో వడ్డించిన గ్లామర్‌ను తదన్నేలా మరో పాటలో గ్లామర్ చిందిస్తూ హిందీ మాస్ ఆడియన్స్‌కు కునుకు లేకుండా చేస్తుంది. అంతకుముందు అల్లుడు శీను, కేజీఎఫ్, జైలర్, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో దుమ్ములేపింది. గత సంవత్సరం హిందీలో స్త్రీ2, ఈ యేడు రైడ్2 సినిమాల్లో ప్రత్యేక గీతాలతో బీ టౌన్‌ను షేక్ చేసింది.
తాజాగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తూ తెరకెక్కించిన ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (Bads of Bollywood) వెబ్ సిరీస్‌లోనూ ఈ మిల్కీ బ్యూటీ గఫూర్ (Ghafoor) అంటూ సాగే ఓ పాట చేసింది. ఈ పాటలోనూ గత చిత్రాలను మించేలా ఫ్యాన్స్, సినిమా లవర్స్ ఖంగుతినేలా అంగంగా ప్రదర్శణ చేసింది. ముఖ్యంగా పాట అసాంతం ఇన్నర్ వేర్ కనిపించేలా ఉన్న తమన్నా డ్రెస్సింగ్‌పై నెట్టింట పెద్ద దుమారమే రేగుతుంది. ఆ పాట చూసిన వారంతా తమన్నాకు ఏమైంది ఇంతలా ఎందుకు చేస్తోంది, అంత అవసరం ఏమొచ్చింది అంటూ ఇంకా మనం ఉచ్చరించలేని విధంగా చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.