సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jacqueline: జాక్వలిన్‌ రూ.215 కోట్లు మనీ లాండరింగ్‌.. సుప్రీం నిరాకరణ..

ABN, Publish Date - Sep 22 , 2025 | 06:43 PM

బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది.


బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. తనపై ఉన్న రూ.215 కోట్ల ఈడీ కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటీషన్‌ను తిరస్కరించింది.

అసలు ఏం జరిగిందంటే.. ఎకనామిర్‌ ఆఫెండర్‌ సుకేశ్‌ చంద్రశేఖర్‌ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200 కోట్ల దోపిడీ కేసులో జాక్వెలిన్‌ను ఈడీ నిందితురాలిగా పరిగణించిన సంగతి తెలిసిందే. దోపిడీ చేసిన డబ్బు నుంచి నటి లబ్థి పొందినట్లు దర్యాప్తులో గుర్తించామని ఈడీ వర్గాలు తెలిపాయి. సుకేశ్‌ చంద్రశేఖర్‌ దోపిడీదారు అని జాక్వెలిన్‌కు ముందే తెలుసని, అయినప్పటికీ అతడితో సాన్నిహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లిందని ఈడీ టీమ్‌ తెలిపింది. దాదాపు రూ.215 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్‌ నుంచి జాక్వెలిన్‌ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అత్యంత ఖరీదైన డిజైనర్‌ బ్యాగులు, జిమ్‌ సూట్లు, వజ్రాల చెవిపోగులు, బ్రాస్‌లెట్‌, మినీ కూపర్‌ కారు. ఇలా దాదాపు రూ.10కోట్ల విలువైన కానుకలను జాక్వెలిన్‌, ఆమె కుటుంబసభ్యులకు సుకేశ్‌ ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌పై ఉన్న కేసును కొట్టివేయడం కుదరదంటూ ఇంతకుముందు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ జాక్వెలిన్‌ సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం జాక్వెలిన్‌ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.

Updated Date - Sep 22 , 2025 | 06:53 PM