సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Shah Rukh Khan: రూ.12,490 కోట్ల ఆస్తి.. ప్రపంచ అత్యంత ధనిక నటుల జాబితాలో

ABN, Publish Date - Oct 02 , 2025 | 07:32 PM

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో షారుఖ్ ఖాన్ రూ.12,490 కోట్ల ఆస్తితో తొలిసారిగా బిలియనీర్ క్లబ్‌లో ప్రవేశించారు.

Shah Rukh Khan

బాలీవుడ్ బాద్‌షాగా పేరొందిన షారుఖ్ ఖాన్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా విడుదలైన M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో ఆయన తొలిసారిగా బిలియనీర్ క్లబ్‌లో ప్రవేశించారు. మొత్తం రూ.12,490 కోట్ల ఆస్తితో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన షారుఖ్ ఖాన్, ఇప్పుడు అధికారికంగా బిలియనీర్‌గా గుర్తింపు పొందారు. ఆయన త‌ర్వాత‌ సెలబ్రిటీలలో ప్రపంచ ప్రఖ్యాత గాయని టేలర్ స్విఫ్ట్, హాలీవుడ్ కామెడియన్‌ జెర్రీ సైన్‌ఫీల్డ్, అలాగే స్టార్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జనేగర్ కూడా ఉన్నారు.

సాధారణ కుటుంబం నుంచి బాలీవుడ్‌ వరకు సాగిన తన ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న షారుఖ్, నేటి స్థాయికి చేరుకోవడం నిచాలా మందికి ప్రేరణ కలిగించే విషయం. ఒకప్పుడు “జేబులో కేవలం వెయ్యిన్నర రూపాయలతో ముంబైకి వచ్చాను” అని చెప్పిన ఆయన, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక నటుల జాబితాలో నిలవడం అసాధారణ విజయమని చెప్పాలి.

ఈ జాబితాలో షారుఖ్ తర్వాత ఇండియా నుంచి జూహీ చావ్లా అండ్ ఫ్యామిలీ రూ.7,790 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో నిలవగా, హృతిక్ రోషన్ రూ.2,160 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. కరణ్ జోహార్ రూ.1,880 కోట్లతో నాల్గవ స్థానంలో, అమితాబ్ బచ్చన్ అండ్ ఫ్యామిలీ రూ.1,630 కోట్లతో ఐదో స్థానంలో నిలిచారు. ఇదిలాఉంటే.. జూహీ చావ్లా షారుఖ్‌తో కలిసి కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలో వాటా కలిగి ఉండటం విశేషం.

షారుఖ్ సంపద వెనుక ప్రధాన కారణాల్లో ఆయన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐపీఎల్‌లోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం, గ్లోబల్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, అలాగే బాలీవుడ్‌లో వరుస బ్లాక్‌బస్టర్స్ ఉన్నాయి. గతేడాది విడుదలైన పఠాన్, జవాన్, డంకీ సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి. ఇవి కూడా ఆయన ఆర్థిక స్థితిని మరింత బలపరిచాయి.

సినిమాలు, వ్యాపారాలకే పరిమితం కాకుండా షారుఖ్ రియల్ ఎస్టేట్‌లో కూడా విస్తారమైన పెట్టుబడులు పెట్టారు. ముంబై బాంద్రాలోని ఆయన లగ్జరీ ఇంటి విలువే రూ.200 కోట్లకు పైగా ఉందని చెబుతారు. అదనంగా లండన్ పార్క్ లేన్‌లో అపార్ట్‌మెంట్, బెవర్లీ హిల్స్‌లో విల్లా, అలీబాగ్‌లో ఫార్మ్‌హౌస్, ఢిల్లీ, దుబాయ్‌లలో నివాసాలు, ఇంగ్లండ్‌లో వెకేషన్ రిట్రీట్ ఆయన సొంతం. అంతేకాదు, బుగట్టి వెయ్రాన్ (రూ.12 కోట్లు), రోల్స్ రాయిస్ ఫాంటమ్ (రూ.9.5 కోట్లు) వంటి లగ్జరీ కార్లు ఆయన గ్యారేజ్‌ను మరింత ప్రత్యేకంగా నిలిపాయి.

Updated Date - Oct 02 , 2025 | 07:55 PM