Sreeleela: శ్రీలీల.. ఇరగదీసిందిగా! అట్లీ, రణవీర్ సింగ్ కాంబోలో యాడ్
ABN, Publish Date - Oct 19 , 2025 | 06:45 PM
జవాన్, బిగిల్, మెర్సల్ వంటి సూపర్‌హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ అట్లీ, ఇప్పుడు మరో కొత్త ప్రయోగం చేశాడు.
జవాన్, బిగిల్, మెర్సల్ వంటి సూపర్‌హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ అట్లీ, ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తాడు. అయితే ఈసారి సినిమా కాదు కానీ అదే స్థాయిలో ఉండే ఓ భారీ ప్రకటన కావడం విశేషం. ఈ యాడ్.. శ్రీలీల గ్లామర్, బాబీ డియోల్ స్టైల్, రణవీర్ సింగ్ యాక్షన్ ఈ ప్రకటనను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి.
చింగ్స్ దేశీ చైనీస్ బ్రాండ్ కోసం తీసిన ఈ స్పెషల్ క్యాంపెయిన్‌లో బాలీవుడ్ ఎనర్జీ స్టార్ రణవీర్ సింగ్ లీడ్‌గా నటించగా, అతనితో పాటు శ్రీలీల మరియు బాబీ డియోల్ కూడా నటించారు. అట్లీ స్టైల్లో షూట్ చేసిన ఈ ప్రకటన 8 నిమిషాల నిడివితో, డ్రామా, కామెడీ, యాక్షన్, మ్యూజిక్, మసాలాతో నిండిపోయి పూర్తి సినిమా ఫీల్ ఇచ్చేలా ఉంది.
దర్శకుడు అట్లీ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌కి నా హృదయం మొత్తం పెట్టాను. రణవీర్ ఎనర్జీ, బాబీ డియోల్ మ్యాజిక్, శ్రీలీల ప్రెష్‌నెస్ ఇవన్నీ కలిపి ఈ ప్రకటనను ప్రత్యేకంగా మార్చాయి. ఇప్పటివరకు భారత దేశం చూడని ఒక అనుభవం ఇవ్వాలని చింగ్స్ అనుకుంది ప్రేక్షకులు దీన్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అన్నారు.
టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అధ్యక్షురాలు దీపికా భాన్ మాట్లాడుతూ .. చింగ్స్ ప్రతి క్యాంపెయిన్ కూడా బ్లాక్‌బస్టర్‌గా ఉండాలనేది మా లక్ష్యం. రణవీర్ చింగ్ మళ్లీ యాక్షన్‌లోకి వచ్చాడు. అతని ఎనర్జీ ఇప్పటికీ టాప్ గేర్‌లో ఉంది. ఇది మా అతి పెద్ద, అతి బోల్డ్ దేశీ చైనీస్ ప్రాజెక్ట్ అన్నారు.
ఈ వీడియోకు శంకర్–ఏషాన్–లాయ్ మ్యూజిక్ అందించగా, గుల్జార్ రాసిన లిరిక్స్, అరిజిత్ సింగ్ వాయిస్‌తో “మై నేమ్ ఇజ్ రణవీర్ చింగ్” సాంగ్ మరోసారి ట్రెండింగ్‌లో ఉంది. సాయి అభ్యంకర్ చేసిన కొత్త వెర్షన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.