సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sonusood: రైతు దంపతుల కష్టానికి సోను బహుమతి 

ABN, Publish Date - Jul 03 , 2025 | 04:04 PM

తాజాగా, ఓ రైతు కష్టం చూసి సోనూసూద్ చలించిపోయారు. ఆయనకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు.

కరోనా, లక్డౌన్ సమయంలో వలస కార్మికులకు, కష్టాల్లో ఉన్నవారికి  నటుడు  సోనూసూద్ (Sonusood) అందించిన సేవల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  ఇప్పటికి కష్టం  అని ఆయన తలుపు  ఆపన్న హస్తం అందిస్తారు సోను. తాజాగా, ఓ రైతు కష్టం (poor Farmer) చూసి సోనూసూద్ చలించిపోయారు. ఆయనకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ రైతుకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నారు.  (Sonusood good heart)

మహారాష్ట్ర, లాతూర్ జిల్లా, హదోల్తి గ్రామానికి చెందిన 76 ఏళ్ల అంబదాస్ పవార్ అనే రైతుకు పొలం ఉంది. ఆయనకు పొలం ఉన్నా.. ఖర్చు పెట్టి దాన్ని దున్నించేంత డబ్బు లేదు. అందుకే భార్యా, భర్తలు కలిసి నాగలి లాంటి పరికరాన్ని తయారు చేసుకున్నారు. దాన్ని పొలానికి తీసుకెళ్లారు. భార్య నాగలి మేడితోక పట్టుకుంది. ఆ వృద్ధ రైతు నాగలి కోలను మెడకు వేసుకుని లాగాడు. ఇలా ఇద్దరూ ఆ పొలం మొత్తం దున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కాగా, నటుడు సోనూసూద్ దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఆ వృద్ధ దంపతుల కష్టం చూసి ఆయన చలించిపోయారు. వారికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో .. ‘మన రైతు సోదరుడికి ట్రాక్టర్ నడపటం రాదు. అందుకే ఎద్దులు గిఫ్ట్‌గా ఇస్తాను’ అని అన్నారు. సోనూసూద్ తమకు ఎద్దులు గిఫ్ట్ ఇవ్వబోతున్నాడని తెలిసి ఆ వృద్ధ దంపతులు ఎంతో ఆనందిస్తున్నారు. సోను చేస్తున్న సేవలకు అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

Updated Date - Jul 03 , 2025 | 04:49 PM