Aamir Khar: దాదాపు 17 యేళ్ళ తర్వాత...

ABN , Publish Date - May 05 , 2025 | 02:51 PM

ఆమీర్ ఖాన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'తారే జమీన్ పర్' విడుదలై 17 సంవత్సరాలైంది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో 'సితారే జమీన్ పర్' మూవీని ఆయన ప్రొడ్యూస్ చేశారు.

మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) 17 సంవత్సరాల క్రితం స్వీయ దర్శకత్వంలో 'తారే జమీన్ పర్' (Taare Zameen Par) చిత్రాన్ని నిర్మించాడు. హృదయానికి హత్తుకునే కథతో, సన్నివేశాలతో రూపుదిద్దుకున్న ఆ సినిమా చూసి ప్రతి ఒక్కరి కంటిలోనూ నీళ్ళు తెప్పించింది. స్పెషల్ కిడ్స్ లో ఉండే ఆత్మన్యూనత భావం, వారి పట్ల చూపించాల్సిన దానికంటే అతిగా చూపించే జాలీ... ఒక్కోసారి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం వారికి ఇవ్వకపోవడం వంటి అంశాలతో తెరకెక్కిన 'తారే జమీన్ పర్' కమర్షియల్ గానూ ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే తరహా కథాంశంతో ఆమీర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' (Sitaare Zameen Par) మూవీని నిర్మించాడు. 'సబ్ కా అప్నా అప్నా నార్మల్' అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాను మాత్రం ఆయన డైరెక్ట్ చేయలేదు. దీనికి ఆర్.ఎస్. ప్రసన్న (R.S. Prasanna) దర్శకుడు. అపర్ణ పురోహిత్ తో కలిసి ఆమీర్ దీనిని నిర్మించాడు.


'సితారే జమీన్ పర్' సినిమాలో ఆమీర్ ఓ కీలక పాత్రను పోషించాడు. ఇతర ప్రధాన పాత్రలను దర్శిల్ సఫారీ (Darsheel Safary), జెనీలియా దేశ్ ముఖ్ (Genelia Deshmukh) పోషించారు. దాదాపు రెండేళ్ళ తర్వాత ఆమీర్ మళ్ళీ బిగ్ స్క్రీన్ పైకి వస్తున్నాడు. దివ్యానిధి శర్మ రచన చేసిన ఈ సినిమాకు శంకర్, ఇషాన్, లాయ్ (Shankar Ehsaan Loy) త్రయం సంగీతాన్ని సమకూర్చింది. జూన్ 20న మూవీ విడుదల కాబోతోంది. కొద్దిరోజుల క్రితమే సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టాలని ఆమీర్ ఖాన్ టీమ్ భావించినా, పహల్గామ్ ఉదంతం కారణంగా దీనిని వాయిదా వేశారు. ఇప్పుడు ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేస్తూ, ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో వచ్చిన 'తారే జమీన్ పర్' మూవీ పోస్టర్ నే ఇది కూడా తలపింపచేయడంతో ఆ వైబ్స్ మూవీలో కనిపిస్తున్నాయంటూ నెటిజన్స్ కితాబిస్తున్నారు.

Also Read: Hit -3: హిట్టే అంటున్న మేకర్స్...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 05 , 2025 | 02:51 PM