సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sitaare Zameen Par: ఆమిర్ కు చుక్కలు చూపిస్తున్న సి.బి.ఎఫ్‌.సి.

ABN, Publish Date - Jun 16 , 2025 | 01:50 PM

ఆమిర్ ఖాన్ తాజా చిత్రం 'సితారే జమీన్ పర్' విడుదల మరోసారి వాయిదా పడేలా కనిపిస్తోంది. సెన్సార్ సభ్యులు ఇచ్చిన కట్స్ కు ఆమిర్ నో చెప్పడంతో... మూవీ రిలీజ్ కు ప్రతిబంధకం ఏర్పడిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) తాజా చిత్రం 'సితారే జమీన్ పర్' (Sitaare Zameen Par) సైతం సెన్సార్ చిక్కుల్లో ఇరుకున్నట్టు తెలుస్తోంది. 'తారే జమీన్ పర్' (Tare Zameen Par) చిత్రాన్ని ఆమిర్ ఖాన్ అప్పట్లో స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఇప్పుడు అదే తరహాలో ఫిజికల్లీ ఛాలెంజెడ్ పీపుల్ లైఫ్ ను కథావస్తువుగా తీసుకుని 'సితారే జమీన్ పర్'ను నిర్మించాడు. ఈ సినిమాకు ఆర్.ఎస్. ప్రసన్న దర్శకుడు.


జూన్ 20న 'సితారే జమీన్ పర్' మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే... సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ సినిమాకు క్లియరెన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ కథను చాలా అధ్యయనం చేసి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జాగ్రత్తగా తెరకెక్కించామని ఇటు ఆమిర్ ఖాన్, అటు దర్శకుడు ఆర్. ఎస్. ప్రసన్న చెబుతున్నారు. అయినా సరే సీబీఎఫ్సీ సర్టిఫికెట్ ఇవ్వడానికి రెండు కట్స్ చెప్పిందట. ఈ సినిమా విషయంలో తాను ఎలాంటి కట్స్ ను ఆమోదించనని ఆమిర్ చెప్పడంతో సెన్సార్ వారు పెదవి విరిచారని తెలుస్తోంది.


'సితారే జమీన్ పర్' మూవీ సెన్సార్ కు పంపే ముందే సంబంధిత అధికారులతో ఆమిర్ మాట్లాడుతూ, 'ఎలాంటి కట్స్ ఇవ్వొద్దని, దాని వల్ల సినిమా కథ మీద ప్రభావం పడుతుంద'ని చెప్పాడట. అయితే ఇది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కు సంబంధించిన సినిమా కావడంతో... కొన్ని సున్నితమైన అంశాలపై సెన్సార్ వారు అభ్యంతరం వ్యక్తం చేశారట. అవి ఏమిటన్నది బయటకు రాలేదు కానీ వాటిని తొలగించడానికి ఆమిర్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఆమిర్ ముందున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ రివ్యూ కమిటీ (ఆర్.సి.) తలుపు తట్టడమే. అదే జరిగి... రివ్యూ కమిటీ కూడా ఆ కట్స్ చేయాల్సిందే అని అంటే మాత్రం ఆమిర్ అంగీకరించక తప్పదు. పెద్దమనసుతో వాళ్ళు వదిలేస్తే ఈ సినిమా ముందు అనుకున్నట్టు ఈ నెల 20న విడుదల అవుతుంది. ఆమిర్ 'సితారే జమీన్ పర్' మూవీని తెలుగులోనూ విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ లాస్ట్ మినిట్ టెన్షన్స్ తో ప్రమోషన్స్ ను కూడా ఆయన సరిగా చేయలేకపోయారు. రెండు గంటల 35 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 3,500 థియేటర్లలో విడుదల చేయాలని ఆమిర్ ప్లాన్ చేశాడని చెబుతున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మూవీ రిలీజ్ పైనే నీలినీడలు అలముకున్నాయి.

Also Read: Allu Arjun Movie: అట్లీపై కోలీవుడ్ వర్గాల కుట్ర...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 16 , 2025 | 01:51 PM