Shilpa shetty - Bastian: శిల్పాశెట్టి రెస్టారెంట్.. ఒక రోజు టర్నోవర్ ఎంతో తెలుసా..
ABN, Publish Date - Oct 23 , 2025 | 03:15 PM
ముంబైలో శిల్పాశెట్టి నిర్వహిస్తున్న రెస్టారెంట్ టర్నోవర్ గురించి శోభా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి(Shilpa shetty), ఆమె భర్త రాజ్ కుంద్రాపైౖ (Raj Kundra) రూ 30.48 కోట్ల మోసానికి సంబంధించిన కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే! ఈ సందర్భంలో ప్రముఖ రచయిత్రి శోభా డే తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ముంబైలో శిల్పాశెట్టి నిర్వహిస్తున్న రెస్టారెంట్ టర్నోవర్ గురించి శోభా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. శిల్ప నిర్వహిస్తున్న ‘బాస్టియన్’ (Bastian) లగ్జరీ రెస్టారెంట్ ఒక రాత్రిలోనే రూ.2 నుంచి 3 కోట్ల వరకు టర్నోవర్ సాధిస్తుందట. ఈ విషయాన్ని శోభా డే (Shoba De) ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. (One day turnover)
‘ముంబైలో డబ్బు ప్రవాహం చూసి ఆశ్చర్యపోయాను. ఒక రెస్టారెంట్ ఒక్క రాత్రిలో రూ 2-3 కోట్లు వసూలు చేస్తుందట. నమ్మలేక నేను స్వయంగా వెళ్లి చూశాను. నైట్‌లో రూ.2 కోట్లు, వీకెండ్‌ల్లో రూ.3 కోట్లు టర్నోవర్ ఉంటుందని తెలిసింది. మొదట విన్నప్పుడు అసలు నమ్మలేదు. కానీ చూశాక నమ్మాను’ అన్నారు.
ఇంతకీ ఏ రెస్టారెంట్ గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించగా ‘అది బాస్టియన్. కొత్త బాస్టియన్. 21,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో చాలా ఎత్తులో ఉంది. అక్కడికి వెళ్లాక ‘నేను ఎక్కడ ఉన్నానబ్బా’ అనిపించింది. అక్కడి నుంచి ముంబై నగరం మొత్తాన్ని 360 డిగ్రీల్లో చూడగలం. 700 మంది కూర్చునే రెండు డైనింగ్స్ ఉన్నాయి. ఒక్క సాయంత్రంలో 14000 మంది సర్వ్ చేయగల కెపాసిటీ అక్కడ ఉంది. అంత సామర్థ్యం ఉన్నా వెయిటింగ్ హాల్, రోడ్డు మీద జనాలు వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఓల్డ్ మహరాష్ట్రలో దాదర్‌లో ఉన్న ఈ రెస్టారెంట్‌కు లాంబోర్గినీ, ఆస్టన్ మార్టిన్ లాంటి లగ్జరీ కార్లలో కస్టమర్లు వస్తున్నారు. అవన్నీ చూసి షాక్ అయ్యాను. అక్కడ ఒక్కో టేబుల్ ఖర్చు లక్షల్లో ఉంది’ అని ఆమె తెలిపారు.