Shefali jariwala: షఫాలీ మృతి.. ఇంకా క్లారిటీ ఇవ్వని కుటుంబ సభ్యులు
ABN, Publish Date - Jun 28 , 2025 | 03:20 PM
కాంటా లగా సాంగ్‌తో పాపులర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
‘కాంటా లగా’ (Kantaa Lagaa Song) సాంగ్‌తో పాపులర్ అయిన నటి షఫాలీ జరివాలా (shafali death - 42) మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం రాత్రి షఫాలీ అస్వస్థతకు గురవడంతో పరాగ్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కార్డియాక్ అరెస్టుతో మృతిచెందినట్లు తొలుత వార్తలు వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులు దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ‘‘శుక్రవారం రాత్రి 11.15 గంటలకు ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారనీ, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
దీనిపై ముంబయి పోలీసులు అప్‌డేట్ ఇచ్చారు. షఫాలీ మృతికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. దీంతో ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘అర్థరాత్రి ఒంటి గంట సమయంలో షఫాలీ మరణం గురించి సమాచారం అందింది. అంధేరిలోని షఫాలీ నివాసంలో ఆమె మృతదేహాన్ని పరిశీలించాం. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని కూపర్ హాస్పిటల్‌కు తరలించాం. ఆమె మృతికి గల కారణాలపై స్పష్టత రాలేదు’’ అని ముంబయి పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతం షపాలీ ఉండే అపార్ట్‌మెంట్‌తో ఫోరెన్సిక్ నిపుణులు తనిఖీ చేస్తున్నారు. వంట మనిషి, ఇంట్లో పనిచేసే వారిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కేసును అనుమానాస్పద ఘటనగానే పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపారు. ఈ ఉదయం ఆమె భర్త పరాగ్ త్యాగి అపార్ట్‌మెంట్ బయట పెట్ డాగ్‌తో నడుస్తూ కనిపించారని అపార్ట్‌మెంట్‌లో నివశించే వారు చెప్పారని పోలీసులు తెలిపారు.