Shah Rukh Khan: నేషనల్ అవార్డును అందుకు ఉపయోగించుకుంటా..
ABN, Publish Date - Aug 02 , 2025 | 10:11 AM
బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ (Shah Rukh Khan) తొలిసారి జాతీయ పురస్కారం దక్కించుకున్నారు. ఆయన నటుడిగా కెరీర్ ప్రారంభించి మూడు దశాబ్ధాలు పైబడింది. ఈ జర్నీలో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు.
బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ (Shah Rukh Khan) తొలిసారి జాతీయ పురస్కారం దక్కించుకున్నారు. ఆయన నటుడిగా కెరీర్ ప్రారంభించి మూడు దశాబ్ధాలు పైబడింది. ఈ జర్నీలో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. కానీ నేషనల్ అవార్డుకు (national award) నోచుకోలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆయన్ను జాతీయ పురస్కారం వరించింది. అట్లీ (atlee) దర్శకత్వంలో వచ్చిన ‘జవాన్’ (jawan)సినిమా ఈ అవార్డ్ రావడానికి కారణమైంది. ఆయనతోపాటు బాలీవుడ్‌లో మరో నటుడు విక్రాంత్ మాస్సేకు కూడా జాతీయ పురస్కారం దక్కింది. బుల్లితెరతో కెరీర్ ప్రారంభించిన ఆయన ‘12Th ఫెయిల్’లో చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయనకూ నేషనల్ అవార్డు దక్కింది. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ పురస్కారాల్లో షారుక్, విక్రాంత్ జాతీయ ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. అభిమానులు వీరికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.
అట్లీ నమ్మకం నిజమైంది..
అవార్డ్‌కు ఎంపిక కావడం వల్ల షారుక్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం నేను ఆస్వాదిస్తున్న క్షణాలను మాటల్లో చెప్పలేను. మీ అందరి ప్రేమాభిమానాలకు నా హృదయం ఉప్పొంగుతుంది. లైప్ టైమ్ గుర్తుండిపోయే క్షణాలివి. ఈ అవార్డుకు నేను అర్హుడనని భావించిన జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు. అలాగే ‘జవాన్’ చిత్రబృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లీకి.. రుణపడి ఉంటా. అతడు ఈ చిత్రాన్ని ఎంతో నమ్మకంతో తీశాడు. జాతీయఅవార్డు వస్తుందని మొదటి నుంచి నమ్మకంగా ఉన్నారు. ఇక నాతో కలిసి అవిశ్రాంతంగా పని చేసిన నా టీమ్‌కు కృతజ్ఞతలు. షూటింగ్ సమయంలో నా ప్రతి మూడ్‌ను వారు భరిస్తారు. అసహనానికి గురైన నాపై రెట్టింపు శ్రద్థ వహిస్తారు నన్ను ఎంతో అందంగా చూపిస్తారు. వారందరి కృషి వల్లే ఈ అవార్డు సాధ్యమైంది. నా యాక్టింగ్ కెరీర్ ఇలా సాఫీగా సాగడానికి నా కుటుంబం ముఖ్య కారణం. నా భార్య, పిల్లలు నాకు బ్యాక్‌బోన్. ఎంతో సపోర్ట్‌గా నిలుస్తారు. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పుడు వారికి విడిచి దూరంగా ఉండాల్సి వస్తుంది. అయినా చిరునవ్వుతో నాకు సపోర్ట్ చేస్తారు. జాతీయ అవార్డు అంటే కేవలం విజయం కాదు.. అది మన బాధ్యత రెట్టింపు చేస్తుంది. ఇంకా కష్టపడి పని చేసేలా ఉత్సాహాన్నిస్తుంది. దీన్ని కేవలం గుర్తింపుగా కాకుండా మరింత కృషి చేయడానికి బలంగా ఉపయోగించుకుంటాను. మంచి చిత్రాలు చేస్తానని మాటిస్తున్నా’’ అని అన్నారు.