Love And War: ఆ వార్త‌లు.. అబ‌ద్దం! షూటింగ్ అక్క‌డే

ABN , Publish Date - Oct 27 , 2025 | 07:42 AM

దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న గ్రాండియర్ బాలీవుడ్ చిత్రం ‘లవ్ అండ్ వార్’లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Love And War

దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) గ్రాండియర్‌గా తెరకెక్కిస్తోన్న బాలీవుడ్‌ చిత్రం ‘లవ్‌ అండ్‌ వార్‌’ (Love And War). రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), విక్కీ కౌశల్ (Vicky Kaushal), అలియాభట్ (Alia Bhat) ప్రధాన తారాగణం. త్వరలో ఇటలీ (Italy)లో ఈ చిత్రం షెడ్యూల్‌ జరగాల్సి ఉంది.

అయితే ఆ షెడ్యూల్‌ను రద్దు చేసి ముంబైలోనే షూటింగ్‌ జరిపేందుకు మేకర్స్‌ సిద్ధమైనట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. భారీ సెట్స్‌ నిర్మించి అందులో ఇటలీకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారనేది ఆ వార్తల సారాంశం.

Love And War

అయితే ఆ వార్తల్లో నిజం లేదని మేకర్స్‌ తెలిపారు. అయితే ఆ షెడ్యూల్‌ రద్దు కాలేదని మేకర్స్‌ తెలిపారు. కథానుసారం రియల్‌ లొకేషన్లలోనే చిత్రీకరించనున్నట్లు తెలిపారు. నవంబర్‌లో పది రోజుల షెడ్యూల్‌ను ముంబైలో ప్లాన్‌ చేస్తున్నారు.

Love And War

అది పూర్తయ్యాక 20 రోజుల పాటు సాగే గ్రాండ్‌ క్లైమాక్స్‌ షెడ్యూల్‌ను డిసెంబర్‌లో ఇటలీలో చేయనున్నారు. అక్కడ 45 రోజుల షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసినా చివరకు 20 రోజులకు కుదించినట్లు మేకర్స్‌ తెలిపారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Oct 27 , 2025 | 07:43 AM