Karishma Kapoor: రూ. 1900 కోట్లు తీసుకున్నారు.. ఇంకా సరిపోలేదా
ABN, Publish Date - Sep 10 , 2025 | 08:14 PM
కపూర్స్ కుటుంబంలో ప్రస్తుతం ఆస్తి వివాదాలు హీటెక్కిస్తున్నాయి. బిజినెస్ మ్యాన్, కరిష్మా కపూర్ (Karishma Kapoor) మాజీ భర్త సంజయ్ కపూర్ (Sunjay Kapoor) మరణించిన విషయం తెల్సిందే.
Karishma Kapoor: కపూర్స్ కుటుంబంలో ప్రస్తుతం ఆస్తి వివాదాలు హీటెక్కిస్తున్నాయి. బిజినెస్ మ్యాన్, కరిష్మా కపూర్ (Karishma Kapoor) మాజీ భర్త సంజయ్ కపూర్ (Sunjay Kapoor) మరణించిన విషయం తెల్సిందే. ఆయన మరణం తరువాత ఆయన పిల్లలు ఆస్తి కోసం కోర్టుకెక్కారు. సంజయ్ మొదటి భార్య కరిష్మా కుమారుడు కియాన్, కూతురు సమైరా ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఆస్తుల పంపకంలో తన సవతి తల్లి తమను మోసం చేసి ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తున్నట్లు వారు పిటిషన్ లో పేర్కొన్నారు.
తన తండ్రి రాసిన వీలునామాను దాచి, నకిలీ వీలునామాను కుటుంబం ముందు చూపించిందని, తమకు ఆస్తిలో ఎలాంటి హక్కు లేదని చెప్పినట్లు వారు తెలిపారు. ఇక ఈ కేసును విచారణలో భాగంగా సంజయ్ రెండో భార్య ప్రియా సచిదేవ్.. కరిష్మా, ఆమె పిల్లలపై ఫైర్ అయ్యింది. తన భర్త ఆస్తి నుంచి ఇంకెంత లాక్కుంటారని మండిపడింది. ఇప్పటికే ఆ ఇద్దరు పిల్లలకు ఫ్యామిలీ ట్రస్ట్ నుంచి రూ. 1900 కోట్లు అందాయని చెప్పుకొచ్చింది. ఇంకా వారు మిగిలిన ఆస్తి కూడా కావాలని చూస్తున్నారని తెలిపింది.
తన భర్త స్థిర, చర ఆస్తులకు సంబంధించిన వీలునామా రిజిస్టర్ చేయలేదని, కానీ, ఉన్న వీలునామా చెల్లుబాటు అయ్యేదే అని ప్రియ.. న్యాయస్థానంలో మాట్లాడింది. అంతేకాకుండా కరిష్మా పిల్లలు అంతగా ఎందుకు విలపిస్తున్నారు.. అంత అవసరం ఏముంది.. ? ఈ ప్రేమంతా ఇంతకుముందు ఏమైంది..? అని ప్రియ తరుపు న్యాయవాది ఘాటుగా ప్రశ్నలు సంధించారు ఇక ఈ విచారణను కోర్టు అక్టోబర్ 9 కి వాయిదా వేసింది. మరి ఈ రెండు కుటుంబాల ఆస్తి తగాదా కొలిక్కి వచ్చేది ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది.
Pooja Hegde: పూజా పాపను ఇక ఈ రాముడే గట్టెక్కించాలి
Ananya Nagalla: అనన్య నాగళ్ల.. ఊపేస్తోందిగా! కుర్రాళ్ల.. నిగ్రహం నిలిచేనా