సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Family Man 3: అందరూ ఉన్నారు.. సమంత కూడా ఉండి ఉంటే బావుండేది

ABN, Publish Date - Nov 23 , 2025 | 03:29 PM

ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సిరీస్ రానే వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3(The Family Man 3) స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే.

The Family Man 3

The Family Man 3: ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సిరీస్ రానే వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3(The Family Man 3) స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే. రెండు సీజన్స్ విజయాన్ని అందుకున్న రాజ్ అండ్ డీకే.. మూడో సీజన్ తో కూడా విజయాన్ని అందుకొనేలానే ఉన్నారు. ఆరు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అయితే ముందు రెండు సీజన్స్ తో పోలిస్తే మాత్రం కొద్దిగా నిరాశపర్చిందనే చెప్పొచ్చు.

ఈ సిరీస్ లో శ్రీకాంత్ తివారీని అందరూ కొద్దిగా మిస్ అయ్యారని చెప్పొచ్చు. ఒక పక్క ఫ్యామిలీని, ఇంకోపక్క దేశాన్ని తన రెండు భుజాల మీద మోసే శ్రీకాంత్.. ఈ సీజన్ లో కొద్దిగా ఎమోషన్స్ ను తగ్గించాడు. ఇక సిరీస్ కథ పరంగా ఓకే ఓకే అని చెప్పొచ్చు. నాగాలాండ్ రెబల్స్ నేపథ్యంలో కథ మొదలయ్యింది.డ్రగ్స్ డీలర్ రుక్మా తప్పించుకోవడం ఎండ్ అయ్యింది.

సిరీస్ లో రాజ్ అండ్ డీకే రెండు సీజన్ లో కనిపించినవారందరినీ చూపించాడు. కల్నల్ విక్రమ్ సందీప్ కిషన్ సెకండ్ సీజన్ లో కనిపించాడు.. మూడో సీజన్ లో ఒక చిన్న పాత్రలో మెరిశాడు. ఇక మూడు సీజన్స్ లో చెల్లం సార్ అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. ఈ సీజన్ లో విజయ్ సేతుపతి సైతం కనిపించి కనువిందు చేశాడు. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఫర్జీ లో మైఖేల్ గా విజయ్ సేతుపతి కనిపించాడు. ఇందులో శ్రీకాంత్ కి హెల్ప్ చేసే ఫ్రెండ్ గా అతనిని చూపించారు. చివరకు చనిపోయిన జోయా బాయ్ ఫ్రెండ్ మిలింద్ ని కూడా ఒక షాట్ లో చూపించారు. కానీ, సమంతను ఒక్క షాట్ లో కూడా చూపించలేదు.

సెకండ్ సీజన్ లో రెబల్స్ నాయకత్వం వహించిన మహిళ రాజీ పాత్రలో సామ్ కనిపించింది. చివరకు శ్రీకాంత్ తో యుద్ధం చేసి రాజీ తన రెబల్స్ కి ఎంతోకొంత సహాయం చేసింది. అలాంటి పాత్రను మూడో సీజన్ లో ఒక్క షాట్ లో కూడా చూపించకపోవడం బాధాకరమని, ఆమె పేరును కూడా ఎక్కడా కూడా తీసుకురాలేదు. దీంతో నెటిజన్స్ రాజీని మిస్ అవుతున్నామని కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Nov 23 , 2025 | 03:29 PM