సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Salman Khan: భవిష్యత్తు ఎప్పుడు.. ఎలా ఉంటుందో తెలీదు కదా..

ABN, Publish Date - Sep 25 , 2025 | 06:37 PM

బాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ ఎవరంటే గుర్తొచ్చే పేరు కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan). ఆ మధ్యన ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోకు గెస్ట్‌గా హాజరైన ఆయన తనని తాను ‘నవ మన్మథుడు’గా చెప్పుకొన్నారు.

బాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ ఎవరంటే గుర్తొచ్చే పేరు కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan). ఆ మధ్యన ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోకు గెస్ట్‌గా హాజరైన ఆయన తనని తాను ‘నవ మన్మథుడు’గా చెప్పుకొన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌కు ఆయనకు 60 ఏళ్లు వస్తున్నాయి. ఇన్నాళ్లూ పెళ్లి, పిల్లల గురించి ఆలోచించని ఆయన తొలిసారి తనకు పిల్లలు కావాలంటూ మనసులో మాట చెప్పారు. ‘టూ మచ్‌ విత్‌ కాజోల్‌ అండ్‌ ట్వింకిల్‌’ (Too Much with Kajol and Twinkle) టాక్‌ షోలో ఆమీర్‌ఖాన్‌తో కలిసి సల్మాన్‌ పాల్గొన్నారు. ఈ వేదికగా ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ షో గురువారం నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.

ఈ షోలో ట్వింకిల్‌ మాట్లాడుతూ ‘సల్మాన్‌ ఎప్పుడో తనని తాను ‘నవ మన్మథుడు’గా పేర్కొన్నాడు. అయితే, ఆయనకు డజను మంది పిల్లలు ఉండి ఉండవచ్చు. కానీ, వాళ్ల గురించి మనకు తెలియదు. ఆ విషయం సల్మాన్‌కు కూడా తెలిసే ఛాన్స్‌ లేదులే’ అని జోక్‌ చేసింది దానికి స్పందించిన సల్మాన్‌ ‘నాకు పిల్లలు ఉంటే నీకు తెలియకుండా ఉంటుందా? ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్లను మీ ముందుకు తీసుకురాకుండా ఉంటానా’ అని బదులిచ్చారు. పిల్లల్ని దత్తత తీసుకునే ఆలోచన ఏమైనా ఉందా? అని అడగ్గా, లాంటి ఆలోచనే లేదు. కానీ భవిష్యత్‌లో తప్పకుండా నాకు పిల్లలు కావాలి’ అని అన్నారు.

దానికి ఇంకా టైమ్‌ ఉందా అని ట్వింకిల్‌ ప్రశ్నించగా ‘ఎప్పుడైనా అది జరగొచ్చు. కచ్చితంగా ఒక బిడ్డ అయితే ఉంటుంది. భవిష్యత్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా! దేవుడి దయ’ అని సల్మాన్‌ ఖాన్‌ అన్నారు. తనకు పిల్లలు పుడితే తన కుటుంబం వారి ఆలనా పాలనా చూసుకుంటుందని చెప్పారు. సల్మాన్‌ మేనకోడలు అలీజ్‌, మేనల్లుడు అయాన్‌ కూడా పెద్ద వారయ్యారని, అంతా వాళ్లే చూసుకుంటారని ఆయన అన్నారు. పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని పేర్కొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 07:01 PM