Salman Khan: సల్మాన్ కొత్త లగ్జరీ కారు.. ధర ఎంతంటే!
ABN, Publish Date - Jun 26 , 2025 | 02:58 PM
బాలీవుడ్ మెగాస్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ గ్యారేజీలోకి మరో కొత్త కారు వచ్చి చేరింది.
బాలీవుడ్ మెగాస్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ (SalmanKhan) గ్యారేజీలోకి మరో కొత్త కారు వచ్చి చేరింది. ఇప్పటికే సుమారు డజన్ వరకు కార్లను కలిగి ఉన్న ఆయన ఏడాదికి, రెండేండ్లకోసారి కారు మార్చడం ఆనవాయితీగా మారింది. అయితే గత మూడేండ్లుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi Gang) నుంచి వరుస బెందిరింపుల నేపథ్యంలో ఎప్పటికప్పుడు బండ్లు మారుస్తూ చాలా టైట్ సెక్యూరిటీలో గడుపుతున్నారు. ప్రభుత్వం సైతం సెక్యూరిటీని మరింతగా పెంచింది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ నిత్యం రాకపోకలు సాగించే వాహానాల విషయంలో నిత్యం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు.
ఈ క్రమంలో గత సంవత్సరమే రెండు భారీ లగ్జరీ కార్లను ఖరీదు చేసిన ఆయన. ఇంకా ఆ బండిలో సరిగ్గా వేయి, రెండువేల కిలోమీటర్లు తిరగక ముందే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మరో లగ్జరీ కారును కొనుగోలు చేయడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే సల్మాన్ వద్ద టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC200, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ వంటి ప్రీమియం బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉండగా 2023లో నిస్సాన్ బ్రాండ్‌కు చెందిన బులెట్ ప్రూఫ్ వాహనాన్ని దుబాయ్ నుంచి దగుమతి చేసుకున్నాడు. ఆ మరు సంవత్సరమే మళ్లీ అదే బ్రాండ్ నుంచి కొత్త టెక్నాలజీతో వచ్చిన పెట్రోల్ వేరియంట్ నిస్సాన్ బుల్లెట్ ప్రూఫ్ కారును ఇంపోర్ట్ చేసుకున్నాడు.
తిరిగి ఇప్పుడు ఏడాది గడవక ముందే మెర్సిడెస్ మేబాక్ GLS600ని (Mercedes Maybach GLS 600) హై ఎండ్ కారును విదేశాల నుంచి తెప్పించి అందులోనే రాకపోకలు సాగిస్తున్నాడు. గత కారు మాదిగానే ఇందదులోనూ బ్లాస్టింగ్ వార్నింగ్స్‌తో పాటు, పాయింట్ బ్లాంక్ బుల్లెట్ షాట్లను తట్టుకునేలా మందపాటి గాజు షీల్డ్‌లు ఉంటాయి. అంతేకాదు డ్రైవర్ అందులో ప్రయాణిస్తున్న వారిని ఏమాత్రం గుర్తించలేని విధంగా బ్లాక్ షేడ్స్ వంటి అధునాతన భద్రతా ఫీచర్స్ దీని సొంతం. అదేవిధంగా 5.6-లీటర్ వి8 పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ కూడా కారులో ఉంది. దీని ధర ఇండియాలో 3.45 కోట్ల వరకు ఉండగా ట్యాక్సులతో కలిపి 4.30 కోట్లు పలుకుతోంది.