Battle Of Galwan Teaser: పవర్‌ఫుల్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‌గా సల్లు భాయ్.. టీజర్ అదిరిపోయింది
ABN, Publish Date - Dec 27 , 2025 | 09:11 PM
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇవాళ (డిసెంబర్ 27) తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
Battle Of Galwan Teaser: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇవాళ (డిసెంబర్ 27) తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ (Battle of Galwan) టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 2020లో భారత్ - చైనా దళాల మధ్య జరిగిన గల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఒక పవర్‌ఫుల్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. టీజర్‌లో ఆయన చూపించిన హుందాతనం, ఆ ఇంటెన్సిటీ చూస్తుంటే సల్మాన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమనిపిస్తోంది. ‘షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా’ వంటి చిత్రాలతో మెప్పించిన అపూర్వ లఖియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా కెరీర్‌లోనే శారీరకంగా ఇది అత్యంత సవాల్‌తో కూడుకున్న ప్రాజెక్ట్. లడఖ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో, మంచు కురిసే చలిలో, గడ్డకట్టే నీళ్లలో షూటింగ్ చేయడం ఒక పెద్ద టాస్క్. గతంలో కంటే ఈ సినిమా శిక్షణ కోసం నేను ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను’ అని సల్మాన్ తెలిపారు. ఈ చిత్రంలో ఆయన సరసన చిత్రాంగద సింగ్ కథానాయికగా నటిస్తోంది.
సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సల్మా ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సల్మాన్ గత చిత్రం ‘సికందర్’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది, దీంతో అభిమానులందరూ ఈ గల్వాన్ యుద్ధంపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు.